Home » Telangana Govt
Cabinet Meeting: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో రెండు ప్రధాన అంశాలపై చర్చ జరిగింది. సమగ్ర ఇంటింటి కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రి మండలి చర్చించింది.
TG Govt: పంచాయతీ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం తర్జన భర్జనకు గురవుతోంది. కులగణను సంబంధించిన ముసాయిదా సిద్ధమైనప్పటికీ ఇంకా ఫైనల్ రిపోర్టును డెడికేషన్ కమిషన్ ఇవ్వలేదు. ఫిబ్రవరి 2 లోపు కేబినెట్ సబ్ కమిటీకి అందిస్తామని డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి తెలిపింది.
Bandi Sanjay: రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చయ్యే సంక్షేమ పథకాలకు ఎవరి పేరు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని.. కాంగ్రెస్‌కు నచ్చితే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకున్నా అభ్యంతరం లేదంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అభివృద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు.
Telangana Schemes: త్వరలోనే మరో నాలుగు పథకాలను తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. అందులో ప్రధానమైనవి కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఈ పథకాల అమలుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది.
KPHB Lands: భూముల వేలాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చిన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హౌసింగ్ స్థలాల వేలంలో భాగంగా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే నివాసం వద్ద పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యే అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Kidney Racket: అలకనంద కిడ్నీ రాకెట్ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈకేసులో సీఐడీకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది బ్రోకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నీ దాతలు తమిళనాడుకు చెందిన వారుగా, గ్రహితీలు బెంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు.
CM Revanth Reddy: తెలంగాణాకు భారీగా పెట్టుబడులు ఆకర్షించడంలో తెలంగాణ రైజింగ్ బృందం సక్సెస్ అయింది. మొత్తం పది కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. దాదాపు రూ.1.32 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి. కొత్త ఒప్పందాలతో 46 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
Danam Nagender: తెలంగాణ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు ఒకచోట పనిచేస్తూ బదిలీలతో మరోచోటకి వెళ్తారని... కానీ ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తారన్నారు. తాను పుట్టింది, పెరిగింది, రాజకీయ జీవితాన్ని ఇచ్చింది హైదరాబాదే అని అన్నారు.
New Ration Cards: కులగణన సర్వేలో రేషన్ కార్డు లేని కుటుంబాలను గుర్తించి వారికి రేషన్ కార్డులు జారీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ.. రేషన్ కార్డు దరఖాస్తుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కులగణన సర్వే ఆధారంగా కాకుండా గ్రామ సభల్లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
Ration Cards: కొత్త రేషన్ కార్డు జాబితాలో పేర్లు లేకపోయినా ఎలాంటి ఆందోళన అవసరం లేదని.. మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని ఇప్పటికే మంత్రులు సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ నిరంతం కొనసాగుతుందని తెలిపారు. అలాగే గ్రామాల్లో జరిగే గ్రామ సభలో కొత్త రేషన్ కార్డులకు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. నేటి నుంచి (జనవరి 21) నుంచి జనవరి 24 వరకు కొత్త రేషన్ కార్డుల కోసం గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.