Home » Telangana Formation Day
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను హైకోర్టులో ఘనంగా నిర్వహించారు. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని హైకోర్టు ప్రాంగణాన్ని ప్రత్యేక అలంకరణలతో ముస్తాబు చేశారు. పోలీసు బలగాలు ప్రత్యేక గౌరవ వందనంతో చీఫ్ జస్టిస్ అలోక్ అరాధేకు స్వాగతం పలికాయి.
న్యూజిలాండ్‌లో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్ లక్సిన్ పాల్గొన్నారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(టీఏఎన్‌జడ్) ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు ఆదివారం ఆక్లాండ్ నగరంలో నిర్వహించిన కార్యక్రమంలో లక్సిన్ మాట్లాడుతూ పదేళ్లలో రాష్ట్ర పురోగతిని కొనియాడారు. ‘
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు రావాలంటూ స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి సంతకం చేసి, ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానం పంపినా.. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ రాలేదు! ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ హాజరవలేదు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని 2004లోనే చెప్పానని గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సోనియా పాల్గొంటారనుకున్నప్పటికీ..
ఉద్యమ సమయంలో సాగరహారం.. మిలియన్ మార్చ్, వంటావార్పులకు వేదికైన ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం తెలంగాణ దశాబ్ది సంబురాలు అంబరాన్నంటాయి. వరణుడు కూడా ముఖ్యఅతిథిగా పాల్గొన్నాడా? అన్నట్లుగా గంటపాటు వాన దంచికొట్టినా.. కళాకారుల నృత్యాలు, పోలీసుల ఫ్లాగ్‌మార్చ్ ఆగలేదు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ట్యాంక్ బండ్ ముస్తాబైంది. వేడుకలను చూడటానికి వచ్చే వీక్షకులతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. తెలంగాణ పదేళ్ల సంబరాలను చూడడానికి ప్రజలు భారీగా వస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కాంగ్రెస్ (Congress) గెలువ బోతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ దశాబ్ది వేడుకల శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ(Sonia Gandhi). రాష్ట్ర ఆవిర్భావం కోసం అమరులైన వారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల ప్రత్యేక రాష్ట్ర కలను కాంగ్రెస్ పార్టీ(Congress Party) నెరవేరుస్తుందని 2004లోనే కరీంనగర్(Karimnagar)లో హామీ ఇచ్చానన్నారు.
Telangana Formation Day by BRS Party: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దిశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్‌లో ఈ నిర్వహించిన ఈ వేడుకలకు మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. తెలంగాణ ఉద్యమ రోజులను స్మరించుకున్నారు.
తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ(Telangana State Formation Day) శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్(BRS Working President KTR). బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు దశాబ్ది ఉత్సవాలను పండగ వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.