Home » Telangana BJP
మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళ్లాలనుకోవడం తప్పుడు నిర్ణయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. జీవన్ రెడ్డి పార్టీ మారాలనుకోవడం తొందరపాటుతో తీసుకున్న నిర్ణయమని తెలిపారు.
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా కబ్జాలు చేస్తున్నారని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కూడా ప్రభుత్వ భూములను కబ్జా చేశారని విమర్శించారు.
దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చిన సరే కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి ఘోరమైన గులాంగిరి చేస్తోందని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంలోని పదేళ్ల హయాంలో కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం ప్రాజెక్టులు కట్టారని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ సమావేశం ఘనంగా నిర్వహించారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మీద వైసీపీ నేతల దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు పేర్కొన్నారు. ప్రజస్వామ్యంలో మీడియాపై దాడులు చేయడం సరైన పద్ధతికాదన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు, నిర్భంధాలతో ప్రజాగ్రహాన్ని అణిచివేయలేరని చెప్పుకొచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును 2014 తర్వాతి నుంచి ప్రోత్సహిస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. నేషనల్ మిషన్ ఫర్ ఏడిబుల్ ఆయిల్ పేరిట ఆయిల్ పామ్ రైతును ఆదుకోవడానికి ఏటా ఎకరాకు రూ.4200లు కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని తెలిపారు.
కొండగట్టును అభివృద్ధి చేసే బాధ్యత తాము తీసుకుంటామని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. తన కొండగట్టు పాదయాత్ర రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై అనర్హత పిటీషన్‌ను డిస్మిస్ చేయడం దారుణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు.
రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. రైతు సంక్షేమం కోసం కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.