Home » Telangana BJP
Kishan Reddy: బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి , తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పందించారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై పార్టీలో చర్చిస్తామని కిషన్‌రెడ్డి అన్నారు.
Raja Singh: ఎంఐఏం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మా జోలికొస్తే ఊరుకోమని రాజాసింగ్ హెచ్చరించారు.
Bandi Sanjay: బీజేపీకి ఎవరితోనూ రహస్య ఎజెండాలు, సమావేశాలు ఉండవని కేంద్రమంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. డిలీమిటేషన్‌పై ఎలాంటి నిర్ణయం జరగలేదని బండి సంజయ్ అన్నారు.
BJP: తెలంగాణలో వరుస గెలుపుల కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్ రచిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇచ్చిన జోష్‌తో స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించేలా హై కమాండ్ కసరత్తు ప్రారంభించింది.
Raghunandan Rao: కేసీఆర్ ప్రభుత్వంలో చిన్న చూపు చూశారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో ఏనాడైనా బీసీల సంక్షేమానికి కృషి చేసిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు కవిత బీసీల గురించి మాట్లాడుతేంటే విడ్డూరంగా ఉందని రఘునందన్ రావు విమర్శలు చేశారు.
Bandi Sanjay: అవినీతి కేసుల్లో ఆధారాలున్నా కేసీఆర్ కుటుంబాన్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ నిలదీశారు. ఢిల్లీలో కేసీఆర్ కాంగ్రెస్‌తో డీల్ చేసుకున్నందుకు చేష్టలుడిగిపోయారా? అని ప్రశ్నించారు. బీజేపీని అణిచివేయడానికి కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకుంటారా? అని నిలదీశారు.
Laxman: సీఎం రేవంత్‌రెడ్డికి బీజేపీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ బోర్డ్ మెంబర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా. లక్ష్మణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మోదీని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. కేసీఆర్‌కు పట్టిన గతే.. రేవంత్‌కూ పడుతుందని మండిపడ్డారు. మోదీ తినే ఆహారాన్ని, వేసుకునే బట్టలను విమర్శిస్తారా అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో గురుకులాల్లో విషాహారం తిని విద్యార్థులు మరణిస్తుంటే ఏనాడైనా పరామర్శించారా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. హాస్టళ్లలో పురుగుల అన్నం తిని, పాముకాటుకు గురై నిత్యం చనిపోతుంటే మీరెన్నడైనా బాధ్యత వహించారా అని నిలదీశారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి పట్టిన గతే తెలంగాణ కాంగ్రెస్‌కు పడుతుందని కేంద్ర మంత్రి, బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు.. తెలంగాణలో ఇచ్చిన ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఇంకొకరికి ఇవ్వరని... వాళ్లలో వాళ్లే ప్రభుత్వాన్ని కూల్చుకుంటారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
కాలుష్యం.. మానవాళికి ప్రమాదకరంగా మారిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో సామాజిక స్పృహ పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి వ్యక్తికి సామాజిక భాధ్యత తప్పని సరిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. దశాబ్దం క్రితం గాంధీ జయంతి రోజునే మోడీ స్వచ్చా భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గుర్తు చేశారు.