Home » Telangana Assembly
తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు పోలీసులతో, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలపై తాతా మధు క్లారిటీ ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. అసెంబ్లీ బయట బీఆర్ఎస్ నేత నిరసనలు, ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యల నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా మారాయి.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీ తాత మధు అలా మాట్లాడటం సరికాదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మధు మాట్లాడిన భాషను బీజేపీ ఎమ్మెల్యేలమంతా ఖండిస్తున్నామని చెప్పారు.
బీజేపీ ఎమ్మెల్యేల ఆందోళనలతో వాయిదా పడిన తెలంగాణ శాసనసభ తిరిగి మొదలైంది. ఈ సందర్భంగా స్పీకర్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. స్పీకర్‌ను బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దుర్భాషలాడారని మండిపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్పీకర్‌పై మధు అనుచిత వ్యాఖ్యల వీడియోను సీఎంవో విడుదల చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
తెలంగాణ అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద బీఆర్‌ఎస్ నిరసన, పోలీసులు అడ్డుకోవడం తీవ్ర రచ్చకు దారి తీసింది. నల్ల టీషర్టులు ధరించి, ఫ్లకార్డులతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అసెంబ్లీ దగ్గర బీఆర్ఎస్ నేతలు వ్యవహరించిన తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన ఛాంబర్‌లో కాంగ్రెస్ పార్టీ నేతలతో ఈ విషయంపై సీఎం చర్చించారు.
బీజేపీ ఎమ్మెల్యేల నిరసనలతో తెలంగాణ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈరోజు(సోమవారం) ఉదయం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
ఈరోజు(సోమవారం) ఉదయం గన్‌పార్క్ నుంచి ర్యాలీగా అసెంబ్లీ గేటు వద్దకు వచ్చిన బీఆర్‌ఎస్ నేతలు లోపలికి వెళ్లేందుకు యత్నించారు. వారిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.