• Home » Teenmaar Mallanna

Teenmaar Mallanna

Teenmar Mallanna:  తీన్మార్ మల్లన్నకు సీఎం రేవంత్ వార్నింగ్

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్నకు సీఎం రేవంత్ వార్నింగ్

కాంగ్రెస్ పార్టీలో నేతలకు స్వేచ్ఛ ఎక్కువ ఉండటంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అలాంటి నేతలతో ఇబ్బంది పడుతోంది. సొంత పార్టీపై కొందరు విమర్శలు చేస్తున్నారు. అలాంటి పార్టీపై పీసీసీ ఓ కన్నేసి ఉంచింది. గీత దాటినా వారిపై చర్యలు తప్పవని హెచ్చరించింది.

MLC Mallanna: అప్రమత్తంగా లేకుంటే ఆ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని దోచేస్తారు..

MLC Mallanna: అప్రమత్తంగా లేకుంటే ఆ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని దోచేస్తారు..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) గత పది సంవత్సరాల పాలనలో ప్రజల్నే కాదు దేవుళ్లను సైతం మోసం చేశారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmaar Mallanna) మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కొమురవెల్లి మల్లన్న ఆలయ నిధులతోపాటు తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి నీళ్లు సైతం దోచుకొని పోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Teenmaar Mallanna: పట్టభద్రుల ఎమ్మెల్సీగా మల్లన్న..

Teenmaar Mallanna: పట్టభద్రుల ఎమ్మెల్సీగా మల్లన్న..

ఎమ్మెల్సీ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ బీఆర్‌ఎ్‌సకు భంగపాటు తప్పలేదు. సిటింగ్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని సైతం ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోయింది.

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం!

MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం!

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఉత్కంఠ రేపిన తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి చింతపడు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఘన విజయం సాధించారు.

MLC Elections:  అభ్యర్థుల్లో పెరుగుతున్న టెన్షన్.. ఇప్పటివరకు ఎవరికి ఎన్ని ఓట్లంటే..?

MLC Elections: అభ్యర్థుల్లో పెరుగుతున్న టెన్షన్.. ఇప్పటివరకు ఎవరికి ఎన్ని ఓట్లంటే..?

తెలంగాణ శాసనమండలి (Legislative Council) వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక కౌంటింగ్‌ ఫలితం (By-election Counting Results)పై ఇంకా ఉత్కంఠ వీడలేదు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలుపోటములు తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

TS News: కొనసాగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..!!

TS News: కొనసాగుతోన్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్..!!

వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బై పోల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురువారం రాత్రి పూర్తయ్యింది. ఆ ఓట్లలో ఫలితం తేలలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. ఈ రోజు (శుక్రవారం) మధ్యాహ్నం వరకు ఫలితం వచ్చే అవకాశం ఉంది.

MLC By Polls: 18,565 ఓట్ల ఆధిక్యంలో తీన్మార్‌ మల్లన్న

MLC By Polls: 18,565 ఓట్ల ఆధిక్యంలో తీన్మార్‌ మల్లన్న

శాసనమండలి నల్లగొండ-వరంగల్‌- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా గురువారం రాత్రికి మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు పూర్తయినా ఫలితం తేలలేదు. కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న(చింతపండు నవీన్‌కుమార్‌)కు 1,22,813 మొదటి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి.

Nalgonda: తీన్మార్‌ మల్లన్న ముందంజ ..

Nalgonda: తీన్మార్‌ మల్లన్న ముందంజ ..

వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలిరౌండ్‌ పూర్తయ్యేసరికి కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న (చింతపండు నవీన్‌) 7670 ఓట్లతో ముందంజలో ఉన్నారు. తొలిరౌండ్‌లో తీన్మార్‌ మల్లన్నకు 36,210, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాకేశ్‌ రెడ్డికి 28,540, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌ రెడ్డికి 11,395, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌ కుమార్‌కు 9109 ఓట్లు వచ్చాయి.

Graduate MLC Election 2024: తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక..

Graduate MLC Election 2024: తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక..

Telangana Graduate MLC By Elections: తెలంగాణలో(Telangana) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్(MLC Election Polling) ముగిసింది. ఖమ్మం(Khammam)-నల్లగొండ(Nalgonda)-వరంగల్(Warangal) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం పోలింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది.

MLC Election: తెలంగాణలో 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగుతున్న పోలింగ్..  ఆ ముగ్గురు మధ్యే పోటీ..

MLC Election: తెలంగాణలో 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కొనసాగుతున్న పోలింగ్.. ఆ ముగ్గురు మధ్యే పోటీ..

తెలంగాణలో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి