Home » Teenmaar Mallanna
Teenmar Mallanna: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్‌గా తీన్మార్ మల్లన్న హాట్ కామెంట్స్ చేశారు. కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమన్నారు. పీసీసీ అధ్యక్షుడిపై ఒత్తిడి చేసి రేవంత్ తననుసస్పెండ్ చేయించారు అంటూ మల్లన్న కామెంట్స్ చేశారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్‌పై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన సర్వేపై అనుచిత వ్యాఖ్యలతో పార్టీ విధానాలను ఉల్లంఘించడం
కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిచినందుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడమే కాకుండా బీసీ కుల గణన ప్రతులు చించడంపై ఆ పార్టీ అధిష్టానం సీరియస్ అయింది.
బీసీ కుల గణన నివేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీహెచ్.నవీన్ (తీన్మార్ మల్లన్న)కు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.
తీన్మార్ మల్లన్నకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నోటీసులు జారీ చేసింది. ఆయన ఇటీవల పార్టీ వ్యతిరేక విధానాలు, నాయకత్వంపై చేసిన వ్యాఖ్యల కారణంగా జారీ అయ్యాయి.
తీన్మార్ మల్లన్న సంగతి పార్టీ చూసుకుంటుందని చెప్పారు. గాంధీభవన్‌లో బుధవారం జరిగిన ‘మంత్రితో ముఖాముఖీ’ కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క.. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజల నుంచి వచ్చిన వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు.
హైదరాబాద్: తమ కులాన్ని దూషించారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రెడ్డి సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. డీజీపీ జితేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.
హైదరాబాద్ సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా క్రిటికల్‌గానే ఉందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు. బాలుడు ఇంకా స్పృహలోకి రాలేదని, ఎప్పుడు కోలుకుంటాడో చెప్పలేమని వైద్యులు అంటున్నారని ఆయన వెల్లడించారు. అందరూ నటుడు అల్లు అర్జున్‌ను కలుస్తున్నారు గానీ, అసలు కలవాల్సింది శ్రీతేజ్‌ను కదా? అంటూ ఆయన ప్రశ్నించారు.
తీన్మార్ మల్లన్న వ్యవహార శైలిపై త్వరలో పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని నిఖిల్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఏం జరుగుతుందో తనకు అంతా తెలుసునంటూ సొల్లు వాగుడు వాగుతున్నాడని తీన్మార్ మల్లన్నపై మండిపడ్డారు. తనకు నేరుగా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సన్నిహిత సంబంధాలున్నాయంటూ ప్రచారం సైతం చేసుకుంటున్నాడన్నారు.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌తో కుమ్మక్కు అయి.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటూ మత్స్య కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ఆరోపించారు.