• Home » Technology news

Technology news

భూ వాతావరణంలోకి ఎల్‌వీఎం-3 ఎగువ దశ

భూ వాతావరణంలోకి ఎల్‌వీఎం-3 ఎగువ దశ

గతేడాది 36 ఉపగ్రహాలను మోసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన ఎల్‌వీఎం-3 రాకెట్‌ ఎగువ దశను తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశపెట్టడంలో ఇస్రో విజయం సాధించింది.

X Banned: ఒక్క నెలలో ఇండియాలోని 2 లక్షలకుపైగా ఎక్స్ ఖాతాలపై నిషేధం

X Banned: ఒక్క నెలలో ఇండియాలోని 2 లక్షలకుపైగా ఎక్స్ ఖాతాలపై నిషేధం

ఎలాన్ మస్క్(Elon Musk) నేతృత్వంలోని మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భారతదేశంలోని 2,30,892 ఎక్స్ ఖాతాలపై నిషేధం విధించింది. ఏప్రిల్ 26 నుంచి మే 25 మధ్య గుర్తించిన వాటిలో ఎక్కువ భాగం పిల్లలపై లైంగిక వేధింపులు, నగ్నత్వాన్ని ప్రోత్సహించే పోస్టులున్న ఖాతాలున్నట్లు పేర్కొన్నారు.

స్క్రీన్ లేని ల్యాప్‌టాప్ వచ్చేసింది.. ఎలా పనిచేస్తుందో తెలిస్తే పిచ్చెక్కిపోతుంది..!

స్క్రీన్ లేని ల్యాప్‌టాప్ వచ్చేసింది.. ఎలా పనిచేస్తుందో తెలిస్తే పిచ్చెక్కిపోతుంది..!

స్క్రీన్ లేని ల్యాప్ టాప్ అనగానే ఒకింత ఆశ్చర్యానికి గురికావచ్చు.. కానీ ఇది అక్షరలా నిజం.. త్వరలోనే స్క్రీన్‌లు లేని ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి రానున్నాయి. సాధారణంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పనిచేయడానికి మూలం స్కీన్. ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో ఏదైనా పని చేసేటప్పుడు దానికి సంబంధించిన అవుట్‌పుట్ స్క్రీన్‌లోనే చూసేందుకు వీలవుతుంది.

Whatsapp: వాట్సాప్ నుంచి మరో ఫీచర్.. ఇకపై టైప్ చేయాల్సిన పనిలే..

Whatsapp: వాట్సాప్ నుంచి మరో ఫీచర్.. ఇకపై టైప్ చేయాల్సిన పనిలే..

ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్‌(whatsapp)ను విరివిగా ఉపయోగిస్తున్నారని చెప్పవచ్చు. దీంతో ఈ యాప్‌కు ప్రజల్లో ఆదరణ పెరిగింది. ఈ క్రమంలో ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.4 బిలియన్ల మందికిపైగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది.

Sudhir Srivatsava Innovations: ఎస్‌ఎ్‌సఐ మంత్ర-3 ఆవిష్కరణ

Sudhir Srivatsava Innovations: ఎస్‌ఎ్‌సఐ మంత్ర-3 ఆవిష్కరణ

అత్యాధునిక రోబోటిక్‌ టెలీ సర్జరీ యంత్రం ‘ఎస్‌ఎ్‌సఐ మంత్ర-3’ని ఎస్‌ఎ్‌సఐ(సుధీర్‌ శ్రీవాత్సవ ఇన్నోవేషన్స్‌) సంస్థ గురువారం ఆవిష్కరించింది. అంతేకాక, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ మంత్ర-3 రోబోటిక్‌ వ్యవస్థతో టెలీ సర్జరీ ట్రయల్‌ను విజయవంతంగా చేసి చూపించింది.

Meta: సరికొత్త ఫీచర్‌తో వాట్సప్.. చాట్ బ్యాకప్ కోసం కుస్తీలక్కర్లేదు

Meta: సరికొత్త ఫీచర్‌తో వాట్సప్.. చాట్ బ్యాకప్ కోసం కుస్తీలక్కర్లేదు

కొత్త మొబైల్ తీసుకుంటే పాత ఫోన్లో ఉన్న వాట్సప్ చాట్ అంతా ట్రాన్స్‌ఫర్ చేయడానికి చాలా పెద్ద తతంగం ఉంటుంది. త్వరలో ఆ బాధ లేకుండా ఒక్క క్లిక్‌తో ఏ ఫోన్లోకైనా వాట్సప్ చాట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఎలా అనుకుంటున్నారా. ఇందుకోసమే వాట్సప్ కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకురాబోతోంది.

iPhones Exports: మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్లు.. 2 నెలలు, రికార్డు స్థాయి ఎగుమతులు

iPhones Exports: మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్లు.. 2 నెలలు, రికార్డు స్థాయి ఎగుమతులు

గత రెండు నెలల్లో రూ.16 వేల 500 కోట్ల ఐఫోన్లు విదేశాలకు ఎగుమతి(iPhones Exports) అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లోనే 2 బిలియన్ డాలర్లకుపైగా విలువ కలిగిన ఐఫోన్‌లను ఎగుమతి చేయడం మేడ్ ఇన్ ఇండియా సంకల్పానికి ఎంతో ప్రోత్సాహంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

TEchnology : ఏఐ ఓవర్‌వ్యూస్‌ 15 శాతానికే జవాబు!

TEchnology : ఏఐ ఓవర్‌వ్యూస్‌ 15 శాతానికే జవాబు!

గూగుల్‌కు చెందిన ఏఐ ఓవర్‌వ్యూస్‌ - వివిధ ప్రశ్నలకు స్పందించడంలో తప్పులు చోటుచేసుకుంటున్నాయి. పూర్తిగా తప్పు లేదంటే ఉపకరించని రీతిలో సమాధానాలను ఇస్తోంది. ప్రస్తుతం దాన్ని సరిదిద్దే పనుల్లో గూగుల్‌ ఉంది.

Technology : మూడేళ్ళలో యువతకు చేరువ

Technology : మూడేళ్ళలో యువతకు చేరువ

ఫేస్‌బుక్‌ అనతికాలంలోనే అంటే ఆరంభించిన ఇరవై సంవత్సరాల్లోనే అన్ని వర్గాల ఆదరణ పొందింది. మరీ ముఖ్యంగా గడచిన మూడేళ్ళలో యువతకు మరింత చేరువైంది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ స్వయంగా ప్రకటించింది. అమెరికా, కెనడాలోనే 18-29 మధ్యవయస్కులైన నాలుగుకోట్ల మంది యువత రోజూ ఫేస్‌బుక్‌ని ఉపయోగిస్తున్నారు.

Technology: ఇక ఉబర్‌ రైడ్‌లో గేమ్స్‌ ఆడొచ్చు

Technology: ఇక ఉబర్‌ రైడ్‌లో గేమ్స్‌ ఆడొచ్చు

ఆడుతు, పాడుతు పనిచేయడం కాదు, ప్రయాణిస్తే ఎంతో బాగుంటుంది. ఉబర్‌ సరిగ్గా అదే పని చేయ నుంది. ఉబర్‌ తన ప్రయాణికులను ఆకట్టుకునేందుకు వీలుగా రైడ్‌ సమయంలో మినీగేమ్స్‌ను పరిచయం చేసే పనిలో ఉంది. అందుకుగానే యాప్‌లోనే మినీ గేమ్స్‌ను అభివృద్ధిపరుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి