Home » TATA Group
ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేయడమే కాకుండా ప్రతి వ్యక్తి హృదయంలో చోటు సంపాదించారు. వ్యాపారం చేసి సంపాదించడమే కాదు. సంపాదనలో ఎక్కువ భాగాన్ని సేవా కార్యక్రమాలకు విరాళాలుగా ఇచ్చిన వ్యక్తి రతన్ టాటా. ఆయనలో గొప్ప మానవతావాది కనిపిస్తారు. పోటీ ప్రపంచంలో వేరే వాళ్లను తొక్కి తాను ఎదగాలని ఎప్పుడూ..
మానవతావాది రతన్ టాటా మృతి భారత పారిశ్రామిక రంగానికే కాకుండా సమాజ సంక్షేమాన్ని ప్రగతిని కాంక్షించే ప్రతి ఒక్కరికీ తీరని లోటని కేసీఆర్ అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించానని.. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
భారత వ్యాపార దిగ్గజం రతన్ టాటా సినీరంగంలోనూ కాలుపెట్టారు. అమితాబ్ బచ్చన్ నటించిన ఏత్‌బార్ అనే సినిమాకు ఆయన సహనిర్మాతగా వ్యవహరించారు.
రతన్ టాటా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే రతన్ టాటా మృతి సందర్భంగా ఆయన జీవితానికి సంబంధించి అనేక కథలు చాలానే ఉన్నాయి. కానీ విదేశాల్లో స్థిరపడాలని అనుకున్న క్రమంలో భారత్ ఎందుకు వచ్చారు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణం ఎంటనేది ఇక్కడ తెలుసుకుందాం.
రతన్ టాటా 25 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు చదువు పూర్తి చేసుకుని అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో ఓ ఆర్కిటెక్చర్ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో అక్కడి ఓ మహిళతో ప్రేమలో పడ్డారు. ఆమెను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఏడేళ్లుగా..
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి లోకేశ్ మంగళవారం ముంబైలో టాటా సన్స్ బోర్డు చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో సమావేశమయ్యారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారనే వార్తలతో ఒక్కసారిగా టాటా గ్రూప్ కంపెనీల షేర్లు పడిపోయాయి. తన ఆరోగ్యంపై టాటా క్లారిటీ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటాను సోమవారం తెల్లవారుజామున బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఆయన అనారోగ్యంపై వచ్చిన వార్తలపై స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
టాటా ఎలక్ట్రానిక్స్ సంస్థ కొత్త ఉద్యోగులను నియమించుకునేందుకు రెడీ అవుతోంది. హోసూర్‌లోని సంస్థకు చెందిన ఐఫోన్ అసెంబ్లీ యూనిట్‌లో 20 వేల మందికి పైగా కొత్త ఉద్యోగులను త్వరలో నియమించుకుంటామని టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తాజాగా పేర్కొన్నారు.
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్(Tata Motors) అదరగొడుతోంది. దేశంలో విభిన్న పరిస్థితులు కొనసాగుతున్న వేళ కూడా లాభాల దిశగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ఈ కంపెనీ షేర్లు ఏడాదిలోనే భారీగా పుంజుకున్నాయి. దీంతో మదుపర్లకు పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.