Home » Talasani Srinivas Yadav
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమని సనత్‌నగర్ నియోజవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్ట్ చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: గణేష్ విగ్రహాల నిమజ్జనం సాఫీగా సాగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, నిమజ్జన కార్యక్రమం సవ్యంగా సాగుతోందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ఈ నిమజ్జనాన్ని పర్యవేక్షిస్తున్న ఆయన గురువారం చార్మినార్ వద్ద మీడియాతో మాట్లాడుతూ..
ఈనెల 27న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. 63 అడుగుల్లో పర్యావరణహితమైన మట్టి గణపతి భక్తులను కనువిందు చేస్తోంది. ఖైరతాబాద్ మహాగణపతికి తొలిపూజలో గవర్నర్ తమిళిసై, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేయడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణం వంద కోట్ల రుపాయలతో అభివృద్ధి చెందిందన్నారు. 8 కోట్ల రూపాయలతో ఇండోర్ స్టేడియం నిర్మించబోతున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని.. ఈ పనికిరాని చెత్త ప్రతిపక్ష పార్టీలు కళ్ళు ఉండి చూడలేని పరిస్థితుల్లో ఉన్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు.
జమిలి ఎన్నికల పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. తాజా సర్వేల్లో దేశంలోని ఏ రాష్ట్రంలోనూ బీజేపీ గెలిచే అవకాశం లేదన్నారు. ఉన్నట్లుండి వేవ్ ను మార్చితే ఫలితాలు మారుతాయి అని బీజేపీ అనుకుంటోందన్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం జరపాలని కోరుతున్నామన్నారు.
రాజకీయాల్లో ముఖ్యంగా కావల్సింది సహనం. ఎంత సహనం ఉంటే అంతలా రాణిస్తారు. కానీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకో గానీ ఈ మధ్య పదే పదే సహనం కోల్పోతున్నారు. మొన్నటికి మొన్న స్టీల్ వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా ఓ వ్యక్తిని తోసేసి ఓ వర్గం ఆగ్రహానికి గురయ్యారు.
ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్ సందర్భంగా ఓ వ్యక్తిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తోసేయడం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే దీనిపై తలసాని నేడు క్లారిటీ ఇచ్చారు. ముషీరాబాద్ స్టీల్ బ్రిడ్జి ఓపెనింగ్‌కి మంత్రి కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడిందన్నారు.