Home » Talasani Srinivas Yadav
ఆర్టీసీ చార్జీల పెంపునకు నిరసనగా ఈ నెల 9వ తేదీన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఛలో బస్ భవన్‌కి పిలుపునిచ్చినట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఛలో బస్ భవన్ ధర్నాలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో సహా.. బీఆర్ఎస్ నేతలు పాల్గొంటారని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. వరద ముంపు బాధితులను రేవంత్ రెడ్డి పట్టించుకోలేదని మండిపడ్డారు. తలసాని తనవంతు సహాయంగా బస్తీ వాసులను ఆదుకుంటున్నారని తెలిపారు.
బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ కార్యాచరణ రూపొందించింది. తెలంగాణ భవన్‌లో మంగళవారం బీఆర్ఎస్ బీసీ నాయకుల సమావేశం జరిగింది. కాంగ్రెస్‌కు పోటీగా ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవాలని బీఆర్ఎస్ హై కమాండ్ నిర్ణయం తీసుకుంది.
Talasani: 42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను రేవంత్ సర్కార్ మభ్యపెడుతోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ బిల్లుకు చట్టబద్దత వచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు అమలు కాకుంటే భూకంపం సృష్టిస్తామని హెచ్చరించారు.
నిర్బంధాల నడుమ పండుగలు జరపడం సరికాదని సనత్‌నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి ఆలయం వద్ద ఆయన పర్యటించారు. ఆదివారం బోనాల సందర్భంగా అమ్మవారి దర్శనం సమయంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను పలువురు భక్తులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
Talasani On Bonalu Festival: పండుగలు, జాతరలు అనేది నిర్బంధనంలో జరగవద్దని.. స్వేచ్ఛ వాతావరణంలో జరగాలని తలసాని శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. నాలుగు గంటల పది నిమిషాలకు బ్రహ్మ ముహూర్తం అని ఎవరు చెప్పారని ప్రశ్నించారు.
బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాతే వాటి విశిష్టత మరింత పెరిగిందని మాజీ మంత్రి, సనత్‌నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్(Sanathnagar MLA Talasani Srinivas Yadav) అన్నారు.
Talasani Srinivas Yadav: రేవంత్ ప్రభుత్వం కుట్ర పూరితంగా కులగణన సర్వే చేసిందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఈ సర్వేలో 60లక్షల మంది ఎక్కడకు పోయారో లెక్కలు చెప్పాలని ప్రశ్నించారు.
Talasani Srinivas Yadav: జీహెచ్ఎంసీ రాజకీయం మరోసారి హీటెక్కింది. ఒక వైపు స్టాడింగ్ కమిటీ ఎన్నికలు, మరో వైపు మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం కాక రేపుతుంది. అయితే మేయర్, డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసానికి బీఆర్ఎస్ నయా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.
మీ ఉపాధికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా తాను అండగా ఉంటానని నోటరీ, స్టాంప్ వెండర్లకు సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Sanathnagar MLA Talasani Srinivas Yadav) హామీ ఇచ్చారు.