Home » Tadipatri
తాడిపత్రి మండలం నందలపాడు గ్రామంలో ఆంజనేయస్వామి మాన్యం భూమిలో నివాసముంటున్న కుటుంబాలకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. వారు బుధవారం జిల్లా కేంద్రంలోని దేవదాయశాఖ సహాయ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
Kethireddy peddareddy: ‘‘తాడిపత్రిలో నా ఇంటికి పోలీసులు నన్ను వెళ్ళనివ్వడం లేదు. వేరే దేశానికి వెళ్లాలంటే వీసా కావాలి. తాడిపత్రి కి వెళ్ళాలంటే వీసా ఏమైనా తీసుకోవాలా. పోలీసులు వీసా ఆఫీస్ చెప్పితే అక్కడికి వెళ్లి అప్లై చేసుకుంటా’’ అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎద్దేవా చేశారు.
పట్టణంలోని గానుగవీధి, రాగితోటపాలెంలోని కొన్ని వార్డుల్లో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పర్యటించారు. వార్డుల్లో తిరుగుతూ అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలపై ఆరాతీశారు.
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనను వేరే వాళ్ళతో ఫోన్ చేయించి బెదిరిస్తున్నారని, జేసీ ఫోన్ నెంబర్ కావాలని రాం పుల్లయ్య అనే వ్యక్తి సీఐ సాయిప్రసాద్‌ను అడిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఐ తానేమి మీ సర్వెంట్‌ను కాదని, జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ తానేందుకు ఇవ్వాలంటూ రాం పుల్లయ్యను గద్దించారు. ఈ క్రమంలో...
పట్టణంలోగంజాయి విక్రయాలు, వినియోగం జోరుగా సాగుతోంది. మత్తులో దారుణాలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఈ గొడవలను సీరియస్‌గా తీసుకోవడం లేదు. కొన్ని రోజుల కిందట నందలపాడు, టైలర్స్‌కాలనీ, భగత్‌సింగ్‌నగర్(Bhagatsinghnagar), కూరగాయల మార్కెట్, నంద్యాలరోడ్డు, పాతకోట, సుంకులమ్మపాలెం, విజయనగర్‌కాలనీ, అంబేడ్కర్‌నగర్, ఏటిగడ్డపాలెం తదితర ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్‌పై పోలీసులు దాడులు చేశారు.
కేరళలో ఎర్నాకుళం నుంచి కర్నూలు జిల్లా ఆదోనికి రైలులో తరలిస్తున్న 13 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 12మందిని అరెస్ట్ చేశారు.
JC Prabhakar Reddy vs Madhavi Latha: సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవి లతకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. మరి ఆయన ఎందుకు క్షమాపణలు చెప్పారు? అసలు ఏమైంది..? పూర్తి వివరాల కోసం ఈ కథనం చదవాల్సిందే..
BJP MLA Parthasarathy : టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జే సీ ప్రభాకర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో జేసీకి బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి శుక్రవారం విజయవాడలో వార్నింగ్ ఇచ్చారు.
పేర్ని నాని లాంటి వాళ్లను వదిలిపెట్టవద్దని జేపీ ప్రభాకర్ రెడ్డి సీఎం చంద్రబాబును కోరారు. ‘పేర్ని నాని నిన్ను మాత్రం వదిలేది లేదు.. ఇంటి కొచ్చి నిన్ను కొట్టిన అడిగే దిక్కు లేదు.. నీకు సంస్కారం లేదు... ఇంకోసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే వీపు విమానం మోత మోగిస్తా’ అని ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు.
మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని బీజేపీ నాయకులు అన్నాయి.