Home » T20 Cricket
న్యూజిలాండ్ పర్యటనను దక్షిణాఫ్రికా గెలుపుతో ఆరంభించింది. మౌంట్ మంగునూయ్ వేదికగా జరిగిన తొలి టీ20లో కివీస్‌పై 7 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ప్రోటీస్ జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
ఇంగ్లండ్‌లో జరిగే ‘ది హండ్రెడ్ లీగ్2026’ వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కావ్యా మారన్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.
భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారో వ్యక్తి. టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం సంబరాల్లో భాగంగా హార్దిక్ మువ్వన్నెల జెండాను అవమానించాడని ఫిర్యాదుదారు ఆరోపించారు.
ఉత్కంఠభరిత పోరులో ఇంగ్లండ్‌పై గెలిచే కివీస్‌తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది భారత్. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లు తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆడబోతున్నారు. ఆ క్రికెటర్లు ఎవరంటే.?
టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ చూసేందుకు ముంబై వాంఖడే స్టేడియానికి టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ, భార్య సాక్షితో కలిసి వచ్చాడు. ప్రత్యేక గ్యాలరీ నుంచి వీరు మ్యాచ్‌ను వీక్షించారు. అయితే.. బుమ్రా క్యాచ్ పట్టడంతో సాక్షి ఎగిరి గంతేయగా.. ధోనీ స్పందించి ఆమెను నిలువరించాడు. ఈ ఘటన నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
పొట్టి ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి భారత్ తుది పోరుకు అర్హత సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా.. పలు రికార్డులను బద్దలుకొట్టింది. ఇంతకీ ఆ రికార్డులు ఏమిటంటే...
టీ20 ప్రపంచ కప్ టోర్నీలో అత్యంత కీలకమైన సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక పోరులో టాస్ ఫలితం మ్యాచ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. అభిమానుల దృష్టంతా టాస్‌పైనే నిలిచింది.
వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు తిరుగులేని విజయాలను సాధించింది. ఇప్పటికే 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న లంక జట్టు.. తాజాగా టీ20 సిరీస్‌ను కూడా 2-0తో చేజిక్కించుకుంది.
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్లు అడిలైడ్ వేదికగా ఆఖరి టీ20లో తలపడుతున్నాయి. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మహిళలు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేశారు. ఆతిథ్య ఆసీస్‌కు 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా యూఎస్ఏ-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. యూఎస్ఏకి 191 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.