Home » Suryakumar Yadav
ఐపీఎల్ 2024కు ముందు ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఈ సీజన్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు సూర్య దూరం కావడం ఖాయమైపోయింది.
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాటర్ రింకూ సింగ్ చెలరేగాడు. టీమిండియా 55 పరుగులకే టాప్ 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న దశలో క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ దుమ్ములేపాడు.
Suryakumar Yadav: అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. బంతుల పరంగా అత్యంత వేగంగా 2 వేల పరుగులను పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ ఆరోన్ ఫించ్ రికార్డును బ్రేక్ చేశాడు.
Suryakumar yadav: సౌతాఫ్రికా పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. మంగళవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఓటమిపాలైంది. వర్షం ఆటంకం కల్గించిన ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
India vs South Africa: సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా సిద్ధమైంది. నేటి నుంచి రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. దీంతో నేడు జరిగే మొదటి టీ20 మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని రెండు జట్లు భావిస్తున్నాయి. రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా ఇంకా జట్టులో చేరకపోవడంతో సఫారీలతో టీ20 సిరీస్‌లోనూ టీమిండియాను సూర్యకుమార్ యాదవే నడిపించనున్నాడు.
India vs South Africa: నేటి నుంచి భారత్, సౌతాఫ్రికా టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఆస్ట్రేలియాపై 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-1తో గెలిచిన జోరు మీదున్న టీమిండియా సౌతాఫ్రికాను కూడా ఓడించాలని పట్టుదలగా ఉంది. సౌతాఫ్రికా వేదికగా జరిగే ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో నేడు గెలిచి శుభారంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది.
India vs South Africa: చూస్తుండగానే సౌతాఫ్రికా పర్యటన వచ్చేసింది. ఈ నెల 10 నుంచి భారత జట్టు సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో సఫారీలతో టీమిండియా మూడేసి మ్యాచ్‌ల చొప్పున టీ20, వన్డే, టెస్టు సిరీస్ ఆడనుంది.
Suryakumar Yadav: ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. చివరి ఓవర్లో ఆస్ట్రేలియా విజయానికి 10 పరుగులు మాత్రమే అవసరం కాగా టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.
Suryakumar Yadav: చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మూడో టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా అనూహ్యంగా ఓటమిపాలైంది. 222 పరుగుల భారీ స్కోర్‌ను సైతం మన బౌలర్లు కాపాడలేకపోయారు. ఒకానొక దశలో విజయం మనదే అనిపించినప్పటికీ, ఆ తర్వాత గ్లెన్ మ్యాక్స్‌వెల్ సెంచరీతో విధ్వంసం సృష్టించి మన జట్టుకు మ్యాచ్‌ను దూరం చేశాడు.
టీమిండియా సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డును బద్దలుకొట్టేందుకు మిస్టర్ 360 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 3 అడుగుల దూరంలో ఉన్నాడు. తన తర్వాతి మూడు టీ20 ఇన్నింగ్స్‌ల్లో సూర్యకుమార్ యాదవ్ మరొక 60 పరుగులు చేస్తే టీమిండియా తరఫున వేగంగా 2 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు.