Home » Sunil Gavaskar
నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. యంగ్ హిట్టర్ అభిషేక్ శర్మ(35 బంతుల్లో 84 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌తో .. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్న అభిషేక్.. మ్యాచ్ అనంతరం భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ కాళ్లకు మొక్కాడు.
ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 41 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే స్టార్ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా అర్ధ శతకంతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్.. హర్షిత్ రాణా బ్యాటింగ్‌పై మాట్లాడాడు.
జెమీమా ఒప్పుకుంటే తనతో కలిసి పాట పాడుతానంటూ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. జెమీకి గిటార్ గిఫ్ట్ ఇవ్వడంతో పాటు ఆమెతో కలిసి పాట పాడారు.
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన నాలుగో టెస్ట్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. అయితే మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఒకే రోజు 20 వికెట్లు పడ్డాయి. దీంతో పిచ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సి భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. కోల్‌కతాలోని ఈవెంట్‌లో మెస్సి ఎక్కువ సేపు ఉండలేదని అభిమానులు విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.
భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా సోషల్ మీడియాలో ఫొటోలు, పేరు వాడుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది.
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు పూర్తి చేసుకునే అవకాశముందని దిగ్గజ బ్యాటర్ సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు. 2027 వరల్డ్ కప్ తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగించే సత్తా కోహ్లీకి ఉందన్నాడు.
కోల్‌కతా పిచ్‌పై వస్తోన్న విమర్శలపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ తీవ్రంగా స్పందించాడు. విమర్శకులు భారత క్రికెట్ వైపు వేలెత్తి చూపించడం మానేయాలని మండిపడ్డాడు.
సౌతాఫ్రికాపై తొలి టెస్టులో టీమిండియా ఓడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ఘాటుగా స్పందించాడు. దేశవాళీల్లో ఆడకపోతే ఇలాంటి పిచ్‌లపై ఆడలేరని విమర్శలు గుప్పించాడు.
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడింది. ఈ మ్యాచ్‌లో ఒక్క టెంబా బావుమా తప్పా మిగతా బ్యాటర్లు ఎవ్వరూ క్రీజులో ఉండలేకపోయారు. ఈ విషయంపై టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ స్పందించాడు.