Home » Summer
భానుడి భగభగలతో నగర ప్రజలు విలవిల్లాడుతున్నారు. ప్రస్తుతం 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
వేసవి కాలంలో ఎండలు పెరిగే కొద్దీ ఇళ్లలో ACలు, కూలర్లు, ఫ్యాన్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంతో విద్యుత్ వినియోగం పెరిగి బిల్లులు కూడా ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే వేసవిలో కూడా విద్యుత్ బిల్లులను నియంత్రించుకోవచ్చు.
శివారు ప్రాంతాల్లో ఉదయం పొగ మంచు కురుస్తుంటే, మధ్యాహ్నం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. భిన్న వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఉమ్మడి పశ్చిమ జిల్లాలో భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్చి మొదటి వారంలోనే ఏలూరు నగరంలో 39 డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం తొమ్మిది గంటల నుంచే ఎండల తీవ్రత పెరగడంతో మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి.
మామిడి తోటల్లో పూత పెరిగి కాత దశకు చేరుకున్నాయి. తోటలు ఆశాజనకంగా ఉండడంతో రైతుల్లో దిగుబడిపై ఆశలు చిగురిస్తున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎండలు ముందస్తుగానే ముదురుతున్నాయి. గడిచిన రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో అప్పుడే వేసవి తాపం మొదలైంది.
తెలంగాణలో వేసవి కాలం ప్రారంభమైంది. ఫిబ్రవరి నెల ముగియక ముందే భానుడు భగభగమంటున్నాడు. రేపటి నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి.
నగరంలో పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని, సమ్మర్ డిమాండ్ మొదలైందని, వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) సీఎండీ ముషారఫ్ ఫారూఖీ తెలిపారు.
రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు మళ్లీ పూర్తిగా మందగించాయి. ఎండాకాలం తరహాలో వేడిగాలులు, ఉక్కపోతతోపాటు పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.
మహారాష్ట్ర నుంచి కర్ణాటక, తెలంగాణ మీదుగా కోస్తాంధ్ర వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీనికితోడు పడమర దిశ నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. దీంతో కోస్తాలో అనేకచోట్ల వేడి, ఉక్కపోత కొనసాగాయి.