Home » Sujana Chowdary
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కొత్త ట్రెండ్ సెట్ చేశారు. గెలిచే వరకు ఓ మాట.. గెలిచిన తర్వాత మరో మాట చెప్పే పాత ట్రెండ్‌కు గుడ్‌బై చెబుతూ... ప్రతి నెల నియోజకవర్గంలో తాను చేసిన పనులపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేసే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
Andhrapradesh: ఏపీ చరిత్రలో చాలా శుభదినమని ఎమ్యెల్యే సుజన చౌదరి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... అరాచక ఆటవిక పాలనలో రాష్ట్రం ఏమైందో చూశామన్నారు. అమరావతిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. చట్టం ప్రకారం రావలసిన వాటినే తెచ్చుకోనే స్తోమత లేకుండా గత ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు.
అస్సలు గెలిచే ప్రసక్తే లేదు.. విజయవాడ పశ్చిమ కాకుండా వేరే ఏ నియోజకవర్గం అయినా బాగుండేది.. ఇక్కడ పోటీచేసి సుజనా చౌదరి అనవసరంగా ఓడిపోతారేమోనని కూటమి కార్యకర్తల్లో ఒకింత అనుమానం ఉండేది. సీన్ కట్ చేస్తే.. గెలుపే కాదు, ఊహించని మెజార్టీ దక్కించుకున్నారు..