Home » Srisailam Reservoir
వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టులకు పెద్దఎత్తున వరదనీరు పోటెత్తింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో కొంత మేర నదులు శాంతించాయి. ప్రస్తుతం ప్రాజెక్టుల వద్ద తాజా పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఏడో నంబర్ యూనిట్‌లో కండెన్సర్ కాలిపోయి భారీ శబ్దాలతో పేలుడు జరిగింది. పవర్ హౌస్‌లో వచ్చిన శబ్దాలకు సిబ్బింది పరుగులు పెట్టారు.
దేశంలో అసాధారణ వర్షాలకు వాతావరణ మార్పులే కారణమా? రుతుపవనాలు తిరోగమనం చెందాల్సిన సమయంలో.. పశ్చిమ భారతాన్ని భారీ వర్షాలు.. వరదలు గడగడలాడిస్తుండడానికి కారణమిదేనా?
కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలానికి ప్రమాదకర స్థాయిలో వరద వస్తోంది.
కృష్ణా పరివాహక ప్రధాన జలాశయాలన్నీ ఆకస్మిక భారీ వరదలతో ఉప్పొంగుతున్నాయి.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు 18 క్రస్ట్ గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
వరద రాక కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను శనివారం 589.70 అడుగులుగా ఉంది. 69,284 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
వర్షాకాలం వచ్చిందంటే చాలు నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద పర్యాటకుల సందడి మామూలుగా ఉండదు. ఈసారి కుండపోత వర్షాలు కురవడంతో పెద్దఎత్తున జలాశయానికి నీరు చేరింది. ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరడంతో అన్ని గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. దీంతో నాగార్జునసాగర్ డ్యామ్ నిండుకుండలా మారింది.
సాధారణంగా రిజర్వాయర్లు, డ్యాంలు తదితర జలవనరులున్న ప్రాంతాల్లో చేపలను పట్టడం చూస్తునే ఉంటాం. ప్రకృతికి దగ్గరగా ఉన్న భావన రావాలనే ఉద్దేశంతో చేపలు అక్కడే ఫ్రై చేసి అమ్ముతుంటారు మత్స్యకారులు.
ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద నీరు పోటెత్తింది. ఈ నేపథ్యంలో సోమవారం ఆరు గేట్లను అధికారులు ఎత్తివేశారు. దీంతో రెండు లక్షల క్యూసెక్ల నీరు కిందకు విడుదల చేయనున్నారు. జులై 25వ తేదీన శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి భారీగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం వచ్చి చేరింది.