Home » Social Media
ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్, సీఈఓ భవిష్ అగర్వాల్.. హాస్యనటుడు కునాల్ కమ్రాపై సోషల్ మీడియాలో గరం గరం అయ్యారు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే అసలు మ్యాటర్ ఏంటి, ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రుణమాఫీ మాట నిలబెట్టుకోవాలని రైతులు చలో ప్రజాభవన్‌కు పిలుపునిచ్చిన పాపానికి రాష్ట వ్యాప్తంగా వారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌ను(Instagram) టీనేజర్లు విచ్చలవిడిగా ఉపయోగించలేరు. ఎందుకంటే దీనిలో కీలక మార్పులు చేశారు. ఈ క్రమంలో 18 ఏళ్లలోపు యూజర్ల కోసం మెరుగైన గోప్యత, భద్రతా ఫీచర్‌లను అప్‌గ్రేడ్ చేసింది. అంతేకాదు తల్లిదండ్రుల నియంత్రణ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
భారీ వర్షాలతో విజయవాడ నగరానికి వరద నీరు పోటెత్తింది. నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. వరద నష్టంపై ఉన్నతాధికారులతో చంద్రబాబు కేబినెట్‌లోని పలువురు మంత్రులు సమావేశమయ్యారు. అందుకు సంబంధించిన ఓ ఫొటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. వ్యతిరేక ప్రచారానికి వైసీపీ శ్రీకారం చుట్టింది. ఈ ప్రచారంపై ఐటీడీపీ తనదైన శైలీలో స్పందించింది. ఈ సందర్బంగా వైసీపీకి ఐటీడీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది.
సోషల్ మీడియాను సక్రమంగా వాడుకుంటే అద్భుతాలు జరుగుతాయి, ఎన్నో సమస్యలు ఇట్టే పరిష్కారమవుతాయి అనేందుకు ఉదాహరణగా నిలిచే ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్‌ను కించపరిచేలా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేశారనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణనగర్ సమీపంలోని ఫుల్బరీకి చెందిన సుజిత్ హల్దార్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు.
చిన్నపిల్లలు సోషల్ మీడియా వాడకుండా పూర్తిగా నిషేధం విధించాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురానున్నట్లు ఆ దేశ ప్రధాని ఆంథోని అల్బనీస్ స్వయంగా వెల్లడించారు.
క్రికెటర్ల ఏదో ఒక సమయంలో హీరోయిన్లు లేదా పలువురు నటీనటులతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు రావడం చూస్తునే ఉంటాం. ఇటివల డివోస్ తర్వాత హార్దిక్ పాండ్యా డేటింగ్ గురించి వార్తలు రాగా, ఇప్పుడు టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మాన్ గిల్(Shubman Gill)కు సంబంధించిన డేంటింగ్ అంశం వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఎక్స్ యజమాని ఎలాన్ మస్క్‌కి బ్రెజిల్ పెద్ద దెబ్బ వేసింది. బ్రెజిలియన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు, ప్రతినిధిని నియమించనందుకు దేశంలో X సేవలను సస్పెండ్ చేశారు. అంతేకాదు ఈ నిబంధనలు పాటించకపోతే జరిమానా కూడా విధిస్తామన్నారు.
ఇటివల టెలిగ్రామ్(telegram) సీఈఓ పావెల్ దురోవ్ అరెస్టు, విడుదల తర్వాత భారతదేశంలో టెలిగ్రామ్ యాప్ బ్యాన్ చేస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతోంది. అయితే ఈ యాప్ ఎందుకు నిషేధించాలని చుస్తున్నారు, దానికి గల కారణాలేంటనే విషయాలను ఇప్పుడు చుద్దాం.