Home » Social Media
ఎనుముల వారి ఏడాది పాలనలో చెప్పుకోవడానికి ఏమున్నది గర్వకారణం అంటే.. మూసీలో లక్షన్నర కోట్ల మూటల వేట.. కొడంగల్ లిఫ్టులో వేల కోట్ల కాసుల వేట.. బావమరిదికి అమృత్ టెండర్లు, కొడుకులకు వేలకోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టే ముఖ్యమంత్రి, మంత్రులు జరుపుకోవాల్సింది విజయోత్సవాలు కాదని.. “కరప్షన్ కార్నివాల్” అని కేటీఆర్ విమర్శించారు.
సోషల్ మీడియా పిల్లల జీవనశైలిపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని వారి పేరెంట్స్ చెబుతున్నారు. అంతేకాదు అందుకోసం ప్రత్యేక చట్టాలు కూడా తీసుకురావాలని కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన ఓ సర్వే షాకింగ్ విషయాలను వెల్లడించింది.
ఏపీ పోలీసుల వరుస చర్యలతో ఉక్కిరి బిక్కిరవుతున్న సోషల్ సైకోలు పలువురు ఏపీని విడిచి పారిపోతున్నారు. మరి కొందరు ఇంకెప్పుడూ ఇలాంటి తప్పులు చెయ్యం. వదిలిపెట్టండి అని పోలీసులను వేడుకుంటున్నారు. ఇంకొందరు భయంతో న్యాయవాదుల్ని వెంట బెట్టుకుని ఠాణాలకు వచ్చి రక్షణ కోరుతున్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఓవైపు తాము అహర్నిశలూ కృషి చేస్తుంటే.. కొంతమంది సోషల్ మీడియాలో ఇష్టానుసారం చెలరేగిపోతున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు.
కూటమి నేతలపై సోషల్ మీడియాలో నీచ వ్యాఖ్యలతో చెలరేగిపోయిన వారు దారికి వస్తున్నారు.
‘విషపు నాగుల కోరలు పీకేయండి. ప్రజలకు వాస్తవాలు తెలియాలి.. ఆ బాధ్యత మేం తీసుకుంటాం.
ప్రభుత్వం ఫేక్‌గాళ్లపై చర్యలు తీసుకుంటామంటే జగన్ ఎందుకు బాధపడుతున్నారనో అర్థం కావడంలేదట. ప్రభుత్వం చర్యలు మొదలుపెడితే తమ తరపున ఫేక్ ప్రచారం చేసేవాళ్లు ఉండరని, దీంతో ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయకపోతే కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తే తమ పార్టీ మనుగడ ఏమి కావాలనే భయంతోనే సీఎం ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే..
‘ప్రశ్నిస్తే సంకెళ్లు వేస్తారా? సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తారా?’ అని జగన్ మూడు రోజులుగా వాపోతున్నారు.
‘కొంతమంది సైకోలు, సైకో పార్టీలతో కలసి ఉచ్ఛం నీచం లేకుండా సోషల్ మీడియాను భ్రష్టు పట్టించారు. మానవ, రక్త సంబంధాలు మరిచి మృగాల లెక్క మారారు.
రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, వారి నమ్మకం వమ్ముకాకుండా పలుపాలసీలు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ నిర్ణయించారు.