Home » Smitha Sabarval
దివ్యాంగుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితాసబర్వాల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని నమో దివ్యాంగ్ క్యాంపెయినింగ్ భారత్, డిసేబుల్డ్ హెల్ప్‌లైన్ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ వికా్‌సశర్మ డిమాండ్ చేశారు.
సివిల్ సర్వీస్‌లలో దివ్యాంగుల కోటాపై చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ అధికారి స్మితాసబర్వాల్(IAS officer Smithasabarwal) ఉపసంహరించుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.
సివిల్స్‌లో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను.. ఢిల్లీకి చెందిన ప్రముఖ అడ్వొకసీ గ్రూప్ ‘డాక్టర్స్ విత్ డిజెబిలిటీస్’ తీవ్రంగా ఖండించింది.
రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్(IAS officer Smita Sabharwal) మాటలు దేశంలోని దివ్యాంగుల మనోభావాలు, ఆత్మవిశ్వాసం దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆమె తక్షణమే దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని ప్రముఖ కళాకారిణి డాక్టర్ పద్మావతి(Dr. Padmavathi) డిమాండ్ చేశారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్(Senior IAS officer Smita Sabharwal) సోషల్ మీడియా పోస్ట్ సోమవారం నగరంలో అలజడి సృష్టించింది. సివిల్స్ పోస్టుల ఎంపికలో దివ్యాంగుల కోటా అవసరమా? అని ఆమె తన వ్యక్తిగత ‘ఎక్స్’ ఖాతాలో చేసిన పోస్ట్‌పై పలు సంఘాలు భగ్గుమన్నాయి.
సివిల్స్‌లో దివ్యాంగుల కోటాపై ప్రశ్నలు సంధించిన సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్.. తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నా ఈ అంశంపై సోమవారం మళ్లీ స్పందించారు. ‘‘సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యను ప్రస్తావించినందుకు చాలా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సివిల్స్‌లో దివ్యాంగుల కోటా అవసరమా అంటూ సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ‘ఎక్స్’లో చేసిన వ్యాఖ్యలపై దివ్యాంగ సంఘాలు మండిపడుతున్నాయి. ఆమె వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని.. 24 గంటల్లో స్మిత బహిరంగ క్షమాపణ చెప్పాలని, ‘ఎక్స్’ వేదికగా చేసిన అనుచిత వ్యాఖ్యలను తొలగించాలని డిమాండ్ చేశాయి.
Telangana: సివిల్స్‌లో దివ్యాంగుల కోటా అవసరమా అంటూ సీనియర్ ఐఏఎస్ అధికారణి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. స్మిత వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. తాజాగా... ప్రముఖ మోటివేటర్, సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ నిర్వాహకురాలు బాలలత స్పందిస్తూ స్మితపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్రైనీ IAS అధికారిణి పూజా ఖేద్కర్ వివాదం తర్వాత ఇప్పుడు UPSC సివిల్ సర్వీసెస్ ఎంపిక విధానం గురించి కొత్త చర్చ మొదలైంది. ఈ వివాదం నేపథ్యంలో తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారిణి స్మితా సబర్వాల్(Smita Sabharwal) ఐఎఎస్‌లో వికలాంగుల కోటాపై కామెంట్లు చేయగా, నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోస్టుల ఎంపికలో దివ్యాంగులకురిజర్వేషన్ అవసరమా? అని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ ప్రశ్నించారు. ఆదివారం ఆమె తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.