Home » Sir
తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా పెద్ద సంఖ్యలో ఓట్ల తొలగింపుపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు స్థానిక ఎన్నికలు జరగడం ఇష్టం లేదని ధ్వజమెత్తారు.
కొత్త ఓటర్ల జాబితా ప్రకటించక ముందే స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. ‘సర్’ (ఎస్‌ఐఆర్) తర్వాత తాజా ఓటర్ల జాబితా అక్టోబరు 3న అమల్లోకి వస్తుందని... ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే మళ్లీ వార్డుల రిజర్వేషన్లు మారే అవకాశం ఉందని సీఎం దృష్టికి తెచ్చారు. అందువల్ల అక్టోబరు 3లోపే స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు.
‘సర్’ ప్రక్రియలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల రోల్ అబ్జర్వర్ మల్లికార్జున అన్నారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై నిబంధనల మేరకు విచారణ చేపట్టాలన్నారు.
ఈసీఐ పేరుతో ఓటర్లకు మోసపూరిత సందేశాలను సైబర్ మోసగాళ్లు పంపిస్తున్నారని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఓటర్ వివరాలు సరిపోలడం లేదంటూ ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు.
ఓటర్ల జాబితా సవరణలు, సమస్యలపై ఆంధ్రప్రదేశ్ సీఈఓను కలిశానని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు పేర్కొన్నారు. 175 నియోజకవర్గాల్లోనూ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేశారని తెలిపారు.
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ(SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రంలో మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
కర్ణాటకలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా ఎలక్షన్ కమిషన్ తన ఓటును తొలగించటంపై బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ వ్యంగ్యంగా స్పందించారు. తను పుట్టి, పెరిగిన ప్రాంతం నుంచి ఓటును తొలగించటం ఓ పెద్ద జోక్ అని ఆయన అన్నారు.
తెలంగాణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తేల్చారు. తెలంగాణలో 73,95,954 మంది ఓటర్లను తొలగించినట్లు సమాచారం.
ఏపీలో కీలక అధికారుల బదిలీలపై నిషేధాన్ని ప్రభుత్వం పొడిగించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.