Home » Singareni Collieries
బొగ్గు గనుల వేలం సింగరేణి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. వరుసగా తెలంగాణలోని బొగ్గు గనులను కేంద్రం వేలం వేస్తుండటంతో.. తవ్వేందుకు సింగరేణికి గనులు కరువయ్యే పరిస్థితి నెలకొంది.
ఓవైపు బొగ్గు నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. మరోవైపు బొగ్గు బ్లాకులు ప్రైవేటు సంస్థల పాలవుతున్నాయి. బొగ్గు నిక్షేపాలు కళ్లముందే కనిపిస్తున్నా.. ప్రభుత్వ అనుమతి లేనందున వేలం పాటకు వెళ్లలేక, వాటిని దక్కించుకోలేని దీన స్థితి.
రాష్ట్రానికి మణిహారంగా ఉన్న సింగరేణి సంస్థను దివాలా తీయించేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలం పాట ప్రారంభించిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం విమర్శించారు.
సీఎం రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో జరిగిన ఆర్థిక విధ్వంసం, దోపిడీ, రాజకీయ జోక్యంపై న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా..? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
తెలంగాణ బిడ్డగా సింగరేణికి అన్యాయం చేయబోనని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి భవిష్యత్తు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంటుందని సింగరేణిపై తెలంగాణ ప్రభుత్వానికే కాకుండా కేంద్రానికి కూడా బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు.
‘‘ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీకి 16 ఎంపీ సీట్లిస్తే విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపగలిగింది. రాష్ట్ర ప్రజలు కాంగ్రె్‌సకు 8, బీజేపీకి 8 ఎంపీ సీట్లు కట్టబెడితే.. ఆ రెండు పార్టీలు సింగరేణిని ఖతం చేయాలని చూస్తున్నాయి’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
రాష్ట్రంలో సింగరేణి పరిధిలో ఉన్న బొగ్గు గనులను కేద్ర ప్రభుత్వం వేలం వేస్తే ఊరుకోబోమని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చెప్పారు. రాష్ట్రం తరఫున పోరాడి తీరతామని స్పష్టం చేశారు. ఖమ్మం కలెక్టరేట్‌లో గురువారం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
రాష్ట్రంలో బొగ్గు గనుల వేలంపై సెంటిమంటలు అంటుకున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని రెండు బొగ్గు నిక్షేపాల బ్లాక్‌లను దాదాపు రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వేలం వేయగా... తాజాగా మరో మూడో బ్లాక్(శ్రావణపల్లి)ని శుక్రవారం వేలం వేస్తున్నారు.
సింగరేణిని ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.