Home » Singapore
Pawan Kalyan: లీ క్వాన్ యూ దూరదృష్టి, నాయకత్వం, సంకల్పానికి నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసించారు. సింగపూర్, ఆంధ్రప్రదేశ్ మధ్య భాగస్వామ్య పురోగతి భవిష్యత్తును నిర్మించడానికి మా సంబంధాలను బలోపేతం చేయడానికి ఎదురు చూస్తున్నామని అన్నారు.
పలు సందర్భాలలో ఎంపీలు అబద్ధపు ఆరోపణలు చేయడం చూస్తుంటాం. కానీ పలు దేశాల్లోని పార్లమెంట్లలో ఇలా చేయాడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఈ విషయంలోనే తాజాగా ఓ ఎంపీకి కోర్టు రూ. 9 లక్షల జరిమానా విధించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
దావోస్ సదస్సు వేదికగా దిగ్గజ కంపెనీల అధినేతలతో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ వరుస సమావేశాలు నిర్వహించారు. సీఆర్డీయే పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఎయిరిండియా సిఈవో క్యాంప్ బెల్ విల్సన్‌ను కోరారు. దుబాయ్ తరహాలో 3 వేల నుంచి 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ సి.విజయకుమార్ చర్చలు జరిపారు. ఈ క్రమంలో వారి మధ్య ఎంవోయూ కుదిరింది. దీంతో వచ్చే నెలలో హెచ్‌సీఎల్ హైదరాబాద్‌లో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేయనుంది.
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్‌లో మూడో రోజు పర్యటిస్తున్నారు. ఈరోజు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో ఆయన ముఖా ముఖి సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు వున్న అవకాశాలను వారికి ముఖ్యమంత్రి వివరించనున్నారు. తర్వాత దావోస్ సమావేశాల్లో గ్రీన్‌కోతో ఎంవోయూ కుదుర్చుకోనున్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ పార్కు ఏర్పాటు కానుంది. రూ.450 కోట్లతో కొత్త ఐటీ పార్కును ఏర్పాటు చేసేందుకు సింగపూర్‌కు చెందిన క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకు వచ్చింది.
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి టీమ్ సింగపూర్ పర్యటన మంచి ఫలితాలు వస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. ఆయా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. తాజాగా హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకొచ్చింది.
రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు.. సింగపూర్ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఎస్టీ టెలీమీడియా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఫోర్త్ సిటీ ముచ్చర్ల సమీపంలోని మీర్ఖాన్‌పేటలో డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.
CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. రెండో రోజు సింగపూర్ పర్యావరణ, వాణిజ్య ఇన్‌చార్జ్ మంత్రి గ్రేస్ ఫు హై యిన్‌తో సీఎం సమావేశమయ్యారు. నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, మూసీ రివర్, పునరుజ్జీవన ప్రాజెక్ట్, నీటి నిర్వహణ తెలంగాణ ప్రణాళికలపై కలిసి పనిచేయడానికి సింగపూర్ మంత్రి ఆసక్తి చూపారు.
CM Revanth: ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనలో తొలిరోజు విశేష స్పందన లభించింది. పర్యటనలో భాగంగా సింగపూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ) క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. అక్కడ నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, అధునాతన సదుపాయాలను పరిశీలించారు. అక్కడ శిక్షణను అందిస్తున్న దాదాపు 20 రంగాలకు చెందిన నిపుణులు, కాలేజీ సిబ్బందిని కలిసి మాట్లాడారు.