Home » Singapore
సింగపూర్ పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా గడుపుతున్నారు. కాపిటలిస్టుల రౌండ్‌టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్‌కి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగు ప్రజలు, ప్రవాస భారతీయులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపం కారణంగా సింగపూర్ వెళ్లాల్సిన ఇండిగో విమానం రన్‌వేపై అకస్మాత్తుగా నిలిచిపోయింది. 133 మంది ప్రయాణికులతో బయలుదేరిన విమానం రన్‌వేపైనే ఆగిపోయింది.
సింగపూర్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక 'షాంగ్రి-లా డైలాగ్' సదస్సు వేదికగా భారత్ తన రక్షణ దౌత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఈ సదస్సు సందర్భంగా భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్.. సింగపూర్, న్యూజిలాండ్ దేశాల రక్షణ శాఖ మంత్రులతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
ఏపీ ఉపాధ్యాయుల బృందం ఈ నెల 4 నుంచి 9 వరకు సింగపూర్‌లో పర్యటించనుంది. సింగపూర్ పర్యటనకు ఏపీలో 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా సింగపూర్‌లో జరుగుతున్న ఏపీ మంత్రుల ఉన్నత స్థాయి శిక్షణ కార్యక్రమం సోమవారంతో విజయవంతంగా ముగిసింది. ఏడో రోజున సింగపూర్ ప్రభుత్వ డిజిటల్ పరివర్తన, పౌర సేవల్లో సాంకేతికత వినియోగంపై మంత్రుల బృందం సమగ్ర అధ్యయనం చేసింది.
సింగపూర్‌లో ఏపీ మంత్రుల బృందం శిక్షణ కార్యక్రమం నాలుగో రోజు కొనసాగుతోంది. సింగపూర్ ప్రభుత్వం ఆధునిక ప్రజాస్వామ్యంలో అవలంభిస్తున్న అభివృద్ధి, పారిశ్రామిక, సాంకేతిక, పర్యావరణ అనుకూల విధానాలను మంత్రులు అధ్యయనం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్‌లో మూడో రోజు పర్యటిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పీఎస్ఏను సందర్శించింది. పోర్టు నిర్వహణలో అత్యాధునిక సాంకేతికతను ఏ విధంగా వినియోగిస్తున్నారో మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్‌లో రెండో రోజు పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ ఉన్నారు.
సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందానికి అక్కడి తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది. ఈరోజు నుంచి ఏప్రిల్ 27 వరకు సింగపూర్‌లో మంత్రుల బృందం పర్యటించనుంది.