Home » Siddipet
తీవ్ర అస్వస్థతకు గురైన రెండేళ్ల బాలికను ఆస్పత్రికి తీసుకెళితే.. ‘‘చచ్చేవాళ్లకు సిరప్ ఎందుకు?’’ అని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆ వైద్యుడు. సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వాస్పత్రిలో ఈ ఘటన జరిగింది.
ఉద్దేశపూర్వకంగా కొంతమంది హిందువుల మీద భౌతిక దాడులు చేస్తే ఊరుకునేది లేదని ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. ఎంతసేపు మర్యాదగా ఉన్నప్పటికీ కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడటం సరికాదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
రైతులకు తమ ప్రభుత్వంలో పెట్టుబడి సాయం పెంచామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని ఉద్ఘాటించారు.
తల్లిదండ్రులు తనకు బీఎండబ్ల్యూ కారు కొనివ్వడం లేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో జరిగింది.
BRS: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కనకయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు.
ఆదివారం విడుదలైన తెలంగాణ ఈసెట్ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా విద్యార్థినులు సత్తా చాటారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించారు.
భారతదేశం అంతర్ యుద్ధం లేకుండా ఉంది అంటే అంబేద్కర్ ముందు చూపు వల్లే సాధ్యమైందని మాజీ మంత్రి హరీష్రావు అన్నారు. బడుగు, బలహీనవర్గాల్లోని ప్రజలకు అంబేద్కర్ తన చదువును ఉపయోగించి భారత రాజ్యాంగాన్ని రచించి అందరికీ దారి చూపించారని హరీష్రావు చెప్పారు.
Harish Rao Slams Govt: కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. అందాల పోటీలకు కోట్లల్లో ఖర్చు చేస్తున్న సర్కార్.. రైతుల సమస్యలను మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ఆర్థికంగా బలహీనమైన గుండె సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత చికిత్సలను అందిస్తున్న ‘శ్రీ సత్యసాయి సంజీవని’ ఆసుపత్రి 108 మంది పిల్లలకు విజయవంతంగా శస్త్రచికిత్సలు నిర్వహించింది. తెలంగాణలోని కొండపాకలో ఉన్న ఈ ఆసుపత్రి అన్ని వైద్య సేవలు ఉచితంగా అందిస్తూ పసికందులకు కొత్త జీవం అందిస్తోంది.
Minister Ponnam Prabhakar: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.