Home » Siddipet
కొమురవెల్లి క్షేత్రం పట్నంవారానికి సిద్ధమైంది. మల్లన్న బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు చెందిన వేలాదిమంది భక్తులు తరలివెళ్లనున్నారు.
జనవరి 26 వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలోమాజీ సీఎం కేసీఆర్‌తో కలిసి ఆయన మనవడు హిమాన్షురావు పొలం పనులు చేశారు.
తెలంగాణ: సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో గల్లంతయిన ఐదుగురిలో నలుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. గల్లంతయిన వారిలో ఇప్పటివరకూ దినేశ్వర్, జతీన్, ధనుష్, సాహిల్ మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటకు తీసుకువచ్చారు.
Telangana: సిద్ధిపేట జిల్లాలోని కొండపోచమ్మ సాగర్ డ్యాంలో సరదాగా ఈతకొట్టేందుకు వెళ్లిన ఆ యువకులను మృత్యువు బలితీసుకుంది. డ్యాంలో పడి ఐదుగురు యువకులు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు యువకులు సురక్షితంగా బయటపడ్డారు.
తెలంగాణ: ఫార్ములా-ఈ కార్ రేస్ (Formula E car race) కేసు నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్(KCR)ను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భేటీ కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Minister Ponnam Prabhakar: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు.
అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొస్తాయంటూ ఊరించిన ఓ ఆన్‌లైన్ ఫైనాన్స్ సంస్థను నమ్మిన కానిస్టేబుల్ రూ.25లక్షలు అప్పు చేసి అందులో పెట్టుబడులు పెట్టి మోసపోయారు.
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి క్షేత్రంలో కొలువైన కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం ఆదివారం సంప్రదాయబద్ధంగా, అంగరంగ వైభవంగా జరిగింది.
సిద్దిపేట: పట్టణం కలకుంట కాలనీలో విషాదం నెలకొంది. ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పండరి బాలకృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యా పిల్లలకు విషమిచ్చి.. కానిస్టేబుల్ పండరి బాలకృష్ణ ఉరి వేసుకున్నాడు. కానిస్టేబుల్ మృతి చెందగా.. ఆయన భార్యా పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.