Home » Siddipet
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు దేవయ్యపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఖమ్మంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో దేవయ్య బయాలజీ టీచర్.
ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో కరెంట్ షాక్ తగిలి ఒకరు చనిపోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. శివాజీ జయంతిని పురస్కరించుకుని బుధవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం జెబ్బాపూర్ గ్రామంలో వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు.
ఇప్పుడు తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు మోదీని ఆశీర్వదించే విధంగా కనిపిస్తోందని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఉపాధ్యాయులకు అండగా కొట్లాడిన పార్టీ బీజేపీ అని, టీచర్ల విషయంలో, మధ్యతరగతి వారి విషయంలో బీజేపీ కృషిచేసిందని ఆయన పేర్కొన్నారు.
లక్ష సూర్య నమస్కారాలు చేయడం లక్ష్యం కాగా 4,02,154 సూర్య నమస్కారాలు చేసి యోగ సాధకులు రికార్డు నెలకొల్పారు. వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్‌లో ఈ రికార్డు నమోదైంది. 1,484 మంది యోగ సాధకులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన గృహిణి (25)కి మూడోసారి గర్భం దాల్చడంతో... ప్రసవం కోసం సమీపగ్రామమైన లక్ష్మీదేవిపల్లిలోని తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఒక నర్సింగ్‌హోమ్‌లో డిసెంబరు 5న ఆమె ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది.
తెలంగాణలో బీఆర్ఎస్‌ది ఇక ముగిసిన అధ్యాయమని, బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రంలో మిగిలాయని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక మూడు రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ఉందని, త్వరలో అక్కడా ఆ పార్టీ ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.
మహారాష్ట్రలోని పుణె, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కలకలం రేపిన గులియన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్) కేసు ఒకటి.. తెలంగాణలోనూ వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లాకు చెందిన ఒక మహిళ(25) దాని బారిన పడింది!
ఉపాధి హామీ పనులు చేస్తుండగా బండ రాళ్లు మీద పడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్నకు పట్నంవారం పెద్దపట్నం, అగ్నిగుండాలను ఘనంగా నిర్వహించారు.
కొమురవెల్లిలో పట్నంవారం! ఈ వేడుక కోసమే హైదరాబాద్ నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తారు. మల్లనస్వామికి పచ్చ, సునేరు, తెల్లపిండి, కుంకుమ, పసుపుతో పటం పరిచి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు.