Home » Siddaramaiah
'ముడా' భూముల కేటాయింపు కుంభకోణంలో ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చడంపై ఆ రాష్ట్ర మంత్రి రామలింగా రెడ్డి స్పందించారు. ఆయన ఎలాంటి మచ్చా లేని ముఖ్యమంత్రి అని అన్నారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(MUDA) కేసులో హైకోర్టు షాకిచ్చింది. సీఎం సిద్ధరామయ్యపై విచారణకు హైకోర్టు ఆమోదం తెలిపి, పిటిషన్‌లో పేర్కొన్న వాస్తవాలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
పన్నుల వాటా పంపిణీలో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో పోరాటానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య సిద్ధమయ్యారు.
రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడిగా ఉన్న నటుడు దర్శన్ విషయంలో జోక్యం చేసుకోవద్దని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఓ మంత్రిని తీవ్రంగా హెచ్చరించినట్టు సమాచారం.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బీజేపీపై సంచలన ఆరోపణ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలకు రూ.100 కోట్లు ఆఫర్ చేసిందన్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఒక పోస్ట్ చేశారు.
కర్ణాటక వాల్మీకి స్కాం దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ స్కాంలో కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈ కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పదించారు. కర్ణాటక కాంగ్రెస్‌కే కాదు.. తెలంగాణ కాంగ్రెస్‌కు కూడా ముచ్చెమటలు పట్టిస్తుందని విమర్శలు చేశారు.
బెంగళూర్ ప్రజలకు కర్ణాటక ప్రభుత్వం షాక్ ఇవ్వబోతుంది. త్వరలో మంచి నీటి ధరల పెంపు ఉండనుంది. ఈ మేరకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటన చేశారు. బెంగళూర్ వాటర్ సప్లై అండ్ సివెజ్ బోర్డు నష్టాల్లో ఉందని వివరించారు. ఆర్థిక నష్టాలను తగ్గించేందుకు నీటిపై పన్ను విధించడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదన్నారు.
మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అనుమతి ఇవ్వడంపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మండిపడ్డారు. ఈ కేసును చట్టబద్ధంగా తాము ఎదుర్కొంటామని, అందుకు అవసరమైన సన్నాహకాలు చేశామని చెప్పారు.
మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) స్కాం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah) ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డారు. ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేయనున్నారు.
మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (MUDA) భూ కేటాయింపు 'కుంభకోణం'పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, జేడీ(ఎస్) శుక్రవారం తమ నిరసన ప్రదర్శనను కొనసాగించాయి.