Home » Siddaramaiah
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కించపరచేలా సోషల్ మీడియాలో వచ్చిన ఓ పోస్ట్‌కు సంబంధించి బీజేపీ కార్యకర్త ఒకరిని శుక్రవారంనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఉడిపి కేసును రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటోందంటూ కాంగ్రెస్ నేత ఒకరు చేసిన వ్యాఖ్యలను శకుంతల అనే బీజేపీ కార్యకర్త షేర్ చేస్తూ, దానికి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు జోడించారు.
బీజేపీ ప్రభుత్వ హయాంలో కర్ణాటకలో చోటుచేసుకున్న కుంభకోణాలపై సిద్ధరామయ్య సారథ్యంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 2021లో బీజేపీ హయాంలో చోటుచేసుకున్న బిట్ కాయిన్ కుంభకోణంపై విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర ప్రకటించారు.
కర్ణాటక కాంగ్రెస్‌కు 5 ఉచిత హామీల అమలు విషయంలో ఎదురీత తప్పడం లేదు. ఇందుకోసం కొన్ని సర్దుబాట్లకు మొగ్గుచూపుతోంది. 'అన్న భాగ్య' పథకం కింద అదనపు బియ్యం సేకరణ కష్టంగా ఉండటంతో బీపీఎల్ కార్డులున్న వారికి 5 కిలోల ఉచిత బియ్యానికి బదులుగా నగదును అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం( గురువారం జరిగిన కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు తీసుకుంది. మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం చేసిన చట్టాలన్నింటినీ సమీక్షించి అవసరమైతే రద్దు చేస్తామని హామీ ఇచ్చింది.
పరువు నష్టం కేసులో దోషిగా తేలడంతో పార్లమెంటుకు అనర్హత వేటు పడిన కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీపై కర్ణాటకలో మరో పరువునష్టం కేసు నమోదైంది.
గోవధ నిషేధ చట్టాన్ని సమీక్షించాల్సి ఉందంటూ కర్ణాటక పశు సంవర్ధక శాఖ కె.వెంకటేష్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చేప్టటిన ఆందోళనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం స్పందించారు. మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని చర్చిస్తామని చెప్పారు. గత బీజేపీ ప్రభుత్వ తీసుకువచ్చిన చట్టంలో స్పష్టత లేదన్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక మధ్య జలాల పంపిణీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వరనా/కొయినా రిజర్వాయర్ నుంచి కృష్ణా నదికి 2.00 టీఎంసీల జలాలు, ఉజ్జయిని రిజర్వాయర్ నుచి భీమా నదికి 3.00 టీఎంసీల నీటిని వదలాల్సిందిగా సంబంధిత అధికారుల ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేకు బుధవారంనాడు ఒక లేఖ రాశారు.
కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సిద్ధరామయ్య సారథ్యంలోని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం పండుగలాంటి వార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కరవు భత్యాన్ని 31 శాతం నుంచి 35 శాతానికి పెంచుతున్నట్టు మంగళవారంనాడు ప్రకటించింది. 2023 జనవరి 1 నుంచి ఈ కరవు భత్యం వర్తింపజేస్తారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతన కేబినెట్ సహచరులందరికీ టార్గెట్‌లను ఫిక్స్ చేశారు. ఏడాదిలోగా లోక్‌సభ ఎన్నికలు రానున్నాయని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు కానుకగా లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను సాధించేదిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. శనివారం 24 మంది కొత్త మంత్రులను చేర్చుకోవడం ద్వారా తన మంత్రివర్గంలోని మొత్తం 34 స్థానాలను భర్తీ చేశారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కేబినెట్ సహచరులకు దిశానిర్దేశం చేశారు.
కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటాలు ప్రారంభమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి నెలకు 200 యూనిట్ల కన్నా