Home » Siddaramaiah
విజయవాడలో 8న నిర్వహిస్తున్న మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమానికి రావాలని కర్ణాటక సీఎం సిద్దరామయ్యను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోరారు.
సిద్ధరామయ్య కుమారుడు రాకేష్ 2016లో బెల్జియంలో మరణించడంపై హెచ్‌డీ కుమారస్వామి ప్రశ్నించారు. అప్పుడు సీఎంగా ఉన్న సిద్ధరామయ్య ఎందుకు రాకేష్ మృతిపై దర్యాప్తునకు ఆదేశించలేదని నిలదీశారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ, జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ(Prajwal Revanna Scandal) పాస్‌పోర్టు రద్దు(Passport Seize) చేయాలని కర్ణాటక ప్రభుత్వం శాశ్వత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు(MEA) శుక్రవారం లేఖ రాసింది.
అసభ్యకర వీడియోల స్కాండల్ వ్యవహారం ముదురుతోంది. పలువురు మహిళలను లైంగికంగా వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హస్సన్ ఎంపీ ప్రజల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్ట్ ను తక్షణం రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోరారు. ఈ మేరకు ఒక లేఖ రాశారు.
కర్ణాటకలో ఓబీసీల(OBC) రిజర్వేషన్లు తొలగించి ముస్లింలకు ఇచ్చారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య(Sidda Ramaiah) తీవ్రంగా స్పందించారు. మోదీ(PM Modi) చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని.. ఓబీసీల రిజర్వేషన్లు తొలగించలేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరెమత్‌కు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Siddaramaiah) క్షమాపణలు చెప్పారు. ఇటీవల నిరంజన్ కూతురు నేహా దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. హత్య తర్వాత కార్పొరేటర్ నిరంజన్ ఇంటికి మంత్రి హెచ్ కే పాటిల్ వెళ్లారు.
లోక్ సభ ఎన్నికల టికెట్ల కేటాయింపు కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాల రేపింది. మంత్రి కేహెచ్ మునియప్ప కుటుంబ సభ్యులకు కోలార్ లోక్ సభ టికెట్ ఇవ్వడంతో తీవ్ర దుమారం రేపింది. కోలార్ లోక్ సభ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో ఐదుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మునియప్ప కుటుంబానికి పార్టీ ప్రాధాన్యం ఇవ్వడంతో ఆగ్రహంతో ఉన్నారు.
కర్ణాటక సీఎం సిద్దరామయ్య హాట్ కామెంట్స్ చేశారు. చామరాజనగర్ లోక్ సభ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సిద్దరామయ్య వరుణ అసెంబ్లీ నియోజకవర్గం చామరాజనగర్ పరిధిలో ఉంటుంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ధృవ నారాయణ చామరాజనగర్ నుంచి కేవలం 1817 ఓట్లతో ఓడిపోయారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాను 48 వేల ఓట్లతో విజయం సాధించానని సిద్దరామయ్య గుర్తుచేశారు. ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కర్ణాటక విధాన సౌధ పాకిస్థాన్ జిందాబాద్ అని నినదించిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన ఇల్తాజ్, బెంగళూర్‌కు చెందిన మునావర్, హవేరికి చెందిన మహ్మద్ షఫీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని బెంగళూరు కోర్టులో ప్రవేశపెట్టగా మూడు రోజుల పోలీసుల కస్టడీకి ఇచ్చారు.
రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe) పేలుడుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. పేలుడు ఘటనను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు. పేలుడు ఘటన విచారణను ఎన్ఐఏకు అప్పగించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదివారం నాడు ప్రకటన చేశారు. ఆ వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పేలుడు ఘటనను ఎన్ఐఏకు ఇస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది.