Home » Sharad Pawar
కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయాల వల్ల సత్తా ఉన్నవారు సైతం ప్రధాన మంత్రి పదవిని చేపట్టలేకపోయారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు.
మహారాష్ట్ర దిగ్గజ నేత శరద్ పవార్ సారథ్యంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ మరో చీలిక దిశగా పయనిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మరోసారి తిరుగుబాటు తప్పకపోవచ్చని పార్టీ వర్గాల సమాచారం. ఈసారి ఎన్‌సీపీ నేత జయంత్ పాటిల్ ఎన్‌సీపీలో తిరుగుబాటుకు నాయకత్వం వహించనున్నట్టు చెబుతున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ మంగళవారంనాడు ఒకే వేదకను పంచుకున్నారు. ప్రధాని వేదికపైకి వస్తూనే అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న శరద్ పవార్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చారు.
‘లోకమాన్య’ బాల గంగాధర్ తిలక్ (Lokmanya Bal Gangadhar Tilak) ఘనతను ప్రజలే గుర్తించారని, ఆయనకు ‘లోకమాన్య’ బిరుదును ఇచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) చెప్పారు. లోకమాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని స్వీకరించడం తనకు మధుర జ్ఞాపకమని తెలిపారు.
తమ పార్టీ, కాంగ్రెస్, శివసేన కలిసి నిర్ణయం తీసుకుంటే మహారాష్ట్రలో మార్పు తీసుకురాగలమని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వంలో తాము నిమగ్నవడం కష్టమని తెలిపారు. కాకపోతే కొంత పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. కలిసి వచ్చే పార్టీలతో సమాలోచనలు ప్రారంభించాయి. ప్రతిపక్షాలు ఈ ప్రయత్నాలను గత నెల నుంచి ముమ్మరం చేయగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తాజాగా రంగంలోకి దిగింది. జాతీయవాదాన్ని వినిపించే బీజేపీని దీటుగా ఎదుర్కొనడం కోసం ప్రతిపక్షాలు తమ కూటమికి ‘దేశభక్తి’ని జోడించాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని గద్దె దించాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. 26 రాజకీయ పార్టీలకు చెందిన దాదాపు 50 మంది నేతలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా ఉంచాలని కోరుతూ ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ ను ఒప్పించేందుకు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్‌సీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు రెండోరోజైన సోమవారంనాడు కూడా ప్రయత్నించారు.
బెంగళూరులో జరుగుతున్న రెండ్రోజుల విపక్ష పార్టీల సమావేశంలో ఎన్‌సీపీ నేత శరద్ పవార్ హాజరుపై అనిశ్చితి తొలగింది. సోమవారం కాకుండా మంగళవారం జరిగే సమావేశంలో పవార్ హాజరవుతారని ఎన్‌సీపీ తెలిపింది.
బెంగళూరులో జరుగుతున్న విపక్షాల సమావేశంలో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ రెండో రోజు పాల్గొననున్నారు. కూతురు సుప్రియా సూలేతో కలిసి ఆయన ఈ సమావేశానికి హాజరుకానున్నారు.