Home » Shaik Haseena
రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. నిరసనకారులు తన అధికారిక నివాసాన్ని చుట్టుముట్టేందుకు రావడంతో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) రాజీనామా చేసి సోమవారమే ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితిని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రధాని మోదీకి(PM Modi) వివరించారు.
రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్ అట్టుడికిపోతున్న వేళ ఆ దేశంలో శరవేగంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా ఆర్మీ హెలీకాఫ్టర్‌లో భారత్‌లో అడుగుపెట్టారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశం బంగ్లాదేశ్ (Bangladesh Clashes)లో తీవ్ర అల్లర్లకు కారణమైంది. ఇప్పటికే ఆ దేశంలో వందల సంఖ్యలో నిరసనకారులు మృతి చెందారు. ఆదివారం ఒక్క రోజే పోలీసులు జరిపిన కాల్పుల్లో 100 మంది నిరసనకారులు చనిపోయారు.
రిజర్వేషన్ల కోటా అంశంపై ఆందోళనకారులు, అధికార పార్టీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణలతో బంగ్లాదేశ్ తగలబడిపోతున్న వేళ ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి ఆందోళనకారులకు అధికార పార్టీ మద్దతుదారులకు మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న హింస ఆదివారం మరో మలుపు తిరిగింది. పోలీసుల దాడుల్లో ఒక్క రోజులో 72 మంది నిరసనకారులు చనిపోయారు.