Home » Sensex
దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) మళ్లీ ఐపీఓల(Upcoming IPOs) వారం వచ్చేసింది. ఈసారి జూన్ 24 నుంచి ప్రారంభమయ్యే ట్రేడింగ్ వారంలో ప్రైమరీ మార్కెట్‌లో చాలా కార్యకలాపాలు ఉన్నాయి. ఎందుకంటే ఈసారి 10 కొత్త IPOలు రాబోతున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) నేడు (జూన్ 19న) ప్రారంభ ట్రేడింగ్‌లో హెచ్చుతగ్గులు కనిపించాయి. మార్కెట్‌లోని ప్రధాన సూచీలు పెరుగుదలతో ప్రారంభమైనప్పటికీ, మొదటి గంట తర్వాత మార్కెట్ భారీ క్షీణతను నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే నిఫ్టీ తొలిసారిగా 23,600కు మించి ప్రారంభమైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) బుధవారం (జూన్ 12) స్వల్ప లాభాలతో మొదలై క్రమంగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో మొదటి గంటలోనే మార్కెట్ మంచి వృద్ధిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 23,419 పాయింట్ల వద్ద సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుంది.
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు సోమవారం ఆరంభ ట్రేడింగ్‌లో సరికొత్త ఉన్నత శిఖరాలను చేరాయి. సెన్సెక్స్ తొలిసారిగా 77,000 మైలురాయిని
ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో మూడోసారి ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన తర్వాత సోమవారం స్టాక్ మార్కెట్లు(Stock Markets) లాభాలతో ప్రారంభమయ్యాయి. మౌలిక సదుపాయాలు, క్యాపిటల్ గూడ్స్, తయారీ రంగ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. వరుసగా ఐదవ రోజైన గురువారం కూడా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మే 30న (గురువారం) బీఎస్‌ఈ సెన్సెక్స్ 0.83 శాతం లేదా 617.60 మేర నష్టపోయి 73,885.60 పాయింట్ల ముగిసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ-50 సూచీ 216 పాయింట్లు లేదా 0.95 శాతం మేర క్షీణించి 22,500 మార్క్ దిగువన 22,489 వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock market) సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్(Sensex), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు(nifty) గ్రీన్‌లో కనిపించాయి. కానీ ఆ తర్వాత నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ఉదయం 10.20 గంటల ప్రాంతంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 550 పాయింట్లు కోల్పోయింది.
దేశీయ స్టాక్ మార్కెట్లో(stock market) శుక్రవారం (ఏప్రిల్ 19న) షార్ప్ కరెక్షన్ కనిపించింది. మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తత, దేశంలో లోక్‌సభ ఎన్నికలు సహా పలు అంశాల ఒత్తిడుల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో దూసుకెళ్తున్నాయి. దీంతో మదుపర్లు కొన్ని నిమిషాల్లోనే పెద్ద ఎత్తున నష్టపోయారు.
గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ పెట్టుబడుల వెల్లువ ఉత్సహంతో... దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం ఆరంభ సెషన్‌లో లాభాల పరుగందుకున్నాయి. ఆరంభంలో బీఎస్ఈ సెన్సెక్స్ సూచీ 307.22 పాయింట్లు లాభపడి జీవితకాల గరిష్ఠ స్థాయి 74,555.44 మైలురాయిని తాకింది. గరిష్ఠంగా 74,658.95 మార్క్‌ను కూడా టచ్ చేసింది. ఇక ఎన్‌ఎస్ఈ నిఫ్టీ సూచీ 79.6 పాయింట్లు వృద్ధి చెందిన ఆల్ టైమ్ గరిష్ఠం 22,593 పాయింట్ల మార్క్‌ను తాకింది. ఇరు సూచీలకు ఇది జీవితకాల గరిష్ఠ స్థాయిగా ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్ (Sensex), ఎన్ఎస్ఈ నిఫ్టీ (NSE Nifty) సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకాయి. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికానికి సంబంధించి టెక్ రంగ కంపెనీలు, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇంధన రంగ కంపెనీల ఫలితాలు సానుకూలంగా ఉండడంతో వారాంతం శుక్రవారం నాడు మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి.