Home » Secunderabad
కాజీపేట - బలార్ష మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జులై 7వ తేదీ వరకు 78 రైళ్లు రద్దు చేసినట్లు, అలాగే 36 రైళ్లను మరో మార్గంలో మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
సికింద్రాబాద్(secunderabad) ప్రధాన రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఫేమస్ ఆల్ఫా హోటల్(Alpha Hotel) గురించి నగరవాసులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ హోటల్ గురించి సోషల్ మీడియా(social media)లో ఇటివల పలు వార్తలు, పుకార్లు ప్రచారం వచ్చాయి. వీటిపై హోటల్ యాజమాన్యం స్పందించి, అలాంటివి నమ్మోద్దని ప్రజలకు సూచించింది. అసలేమైందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆలుగడ్డ బావి వద్ద ఉన్న రైల్వే వాషింగ్ సైడ్ వద్ద ఆగి ఉన్న ఓ కొత్త రైలు రెండు బోగీలకు మంటలంటుకొని అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరుగలేదు.
కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వస్తున్న గంగాపురం కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ఘన స్వాగతం పలకనుంది.
తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యను ఓ వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రామగుండంలోని రాజీవ్ నగర్‌కు చెందిన లక్ష్మణ్, రోజా దంపతులు సికింద్రాబాద్‌లోని తుకారాంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్నారు. భార్య రోజాను కత్తితో కడుపులో పొడిచి లక్ష్మణ్ హతమార్చాడు.
కంటోన్మెంట్ ప్రాంతంలోని సికింద్రాబాద్ క్లబ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. గురువారం సికింద్రాబాద్ క్లబ్ వద్ద రెడ్ సిగ్నల్ పడింది.
లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలైనా.. వారిద్దరూ ఎమ్మెల్యేలుగా కొనసాగనున్నారు. ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ తరపున ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీఆర్‌ఎస్ తరపున సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు పోటీ చేశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ హస్తగతమైంది. ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ ఘనవిజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత వంశీచంద్ తిలక్‌పై 13,206 ఓట్ల మెజారిటీని సాధించా రు.
అంచనా వేసుకున్న దాని కంటే ఒక సీటు తగ్గినా.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలోని అధికార కాంగ్రె్‌సకు భారీ ఊరటనే ఇచ్చాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లలో మెజారిటీ స్థానాలు దక్కక పోయినా, బీజేపీకి సమాన స్థాయిలో సీట్లు దక్కించుకుని గౌరవప్రద స్థానంలో నిలిచింది.
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై అధికారం కోల్పోయిన బీఆర్‌ఎస్.. లోక్‌సభ ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ ప్రభావం ఏమాత్రం తగ్గదని, తాము ఆశించిన 12 స్థానాల్లో అంచనాలు కొంత అటు ఇటు అయినా.. ఆరు స్థానాల్లో మాత్రం గెలుపు అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది.