Home » Secunderabad
సికింద్రాబాద్ కంటోన్మెంట్(Secunderabad Cantonment)లో భూగర్భజలాల పరిరక్షణ, సద్వినియోగంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. బోర్‌వెల్స్ నియంత్రణ, క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకోనున్నది. ఈ మేరకు రూపొందించిన నిబంధనలను ఆమోదిస్తూ కేంద్ర రక్షణ శాఖ ఎస్‌ఆర్‌ఓ 126(ఈ) పేరిట గెజిట్ విడుదల చేసింది.
ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలర్పించిన వారి కంటే తమ శ్రమ గొప్పది కాదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ కోసం తెల్లబండ్ల రవి మొట్టమొదల ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. బిడ్డల ప్రాణ త్యాగాలకు నేడు ఫలితం దక్కిందన్నారు.
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మార్ఫీఎస్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మున్నంగి నాగరాజు, రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరే్‌షమాదిగ తెలిపారు.
సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న పద్మావతి ఎక్స్‌ప్రెస్ రైలుకు జనగామ జిల్లాలో ఆదివారం పెను ప్రమాదం తప్పింది.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల బీజేపీలో జోష్ వ్యక్తమవుతోంది. వర్గీకరణ అంశాన్ని తాము ఎన్నికల కోణంలో కాకుండా సామాజిక కోణంలోనే చూశామని, ఫలితంగా మున్ముందు మాదిగ సామాజికవర్గం తమకు అండగా ఉంటుందని భావిస్తోంది.
నిధుల కేటాయింపుల విషయంలో ప్రతిసారీ సికింద్రాబాద్(Secunderabad)కు అన్యాయం జరుగుతోందని, అందువల్లే సికింద్రాబాద్ ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్(Pawan Kumar Goud) డిమాండ్ చేశారు.
కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలో మార్పు రావాలని మహాంకాళి అమ్మవారిని కోరుకున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ తెలిపారు.
సికింద్రాబాద్(secunderabad) పరిధిలోని పూణే డివిజన్(Pune Division)లో వచ్చే మూడు రోజులు పలు ట్రైన్స్ రద్దయ్యాయి. ఈ మేరకు అధికారులు రద్దైన ట్రైన్ల వివరాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో పూణే డివిజన్‌లో జులై 29 నుంచి 31 వరకు 62 రైళ్లు రద్దయ్యాయి.
Telangana: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమంలో ఘనంగా జరిగింది. బోనాలు పండుగ తరవాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలుచుని స్వర్ణలత భవిష్యవాణి పలికారు. అమ్మవారి ప్రతిరూపంలో మాతంగి స్వర్ణలత ఏ ఏ అంశాలు వ్యక్తపరుస్తుందనే ఆసక్తితో ఎదురు చూస్తున్న భక్తజనానికి అమ్మవారికి పలుకులు ఆనందాన్ని ఇచ్చాయి.
ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. నెత్తిన బోనమెత్తి వచ్చిన ఆడబిడ్డలు, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో లష్కర్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.