Home » Secunderabad
మత విద్వేషాలు రెచ్చగొట్టే కార్యకలాపాలను నిర్వహించిన సికింద్రాబాద్ మెట్రో పొలిస్ హోటల్ యజమాని రషీద్, మేనేజర్ రహమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌లోని కుమ్మరిగూడలో ఆలయంలో విగ్రహం ధ్వంసం ఘటన నేపథ్యంలో శుక్రవారం హిందూ సంఘాలు ఇచ్చిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఆ క్రమంలో సికింద్రాబాద్ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పలు పోలీస్ స్టేషన్లలో ఆందోళనకారులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. మార్కెట్ పోలీస్ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదు కాగా.. గోపాలపురం పీఎస్‌లో మరో కేసు నమోదు అయింది. ఈ బంద్ నేపథ్యంలో ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులపై దాడి చేశారు.
సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద హిందూ సంఘాల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు పలుమార్లు లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తేవాల్సి వచ్చింది.
సికింద్రాబాద్ ప్రాంతమంతా నిర్మానుష్యంగా మారింది. వీరంతా కలిసి మహంకాళి టెంపుల్ నుంచి విగ్రహం ధ్వంసం అయినా టెంపుల్ వరకు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ముత్యాలమ్మ గుడిపై దాడి కేసులో మోటివేషనల్ స్పీకర్ మునావర్ జామ, మెట్రో పోలీస్ హోటల్ యజమాని అబ్దుల్ రషీద్, హోటల్ మేనేజర్ రెహమాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గుడిపై దాడికి పాల్పడ్డ వ్యక్తులు హోటల్‌లో బస చేసినట్లు విచారణ పోలీసులు గుర్తించారు. దాడికి పాల్పడిన నిందితుడు..
హైదరాబాద్‌లో మరో విగ్రహ ధ్వంసం ఘటన చోటుచేసుకుంది. సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయంలో సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశాడు.
సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయంపై దాడి కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. అమ్మవారి విగ్రహంపై దాడి సమయంలో ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
సికింద్రాబాద్ మోండ మార్కెట్ ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద హై టెన్షన్ నెలకొంది. అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. బీజేపీ కార్పొరేటర్లు, వీహెచ్‌పీ, భజరంగదళ్ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగాయి.
జాతిపిత మహాత్మగాంధీ పుట్టిన అక్టోబరు 2వ తేదీకి దక్షిణమధ్య రైల్వేకి విడదీయరాని అనుబంధం ఉంది. ఈ జోన్ పరిధిలో ఎన్నో కార్యక్రమాలు ఇదే రోజున ప్రారంభమయ్యాయి.