Home » Schools
గురుకులాలు సమస్యల నిలయాలుగా మారాయి. సొంత భవనాలున్న గురుకులాల్లో సమస్యలు కొంత తక్కువగా ఉన్నా.. అద్దె భవనాల్లో నడుస్తున్న వాటిలో మాత్రం తిష్ట వేసుకుని కూర్చున్నాయి. కొన్నిచోట్ల సరిపడ తరగతి గదుల్లేవు. పడకల్లేవు. నేలపైనే పడుకుంటున్నారు.
కల్కి సినిమాతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్.. శ్రీమంతుడు సినిమా హీరో మహే్‌షబాబు తరహాలో స్వగ్రామం అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు.
అర్ధరాత్రి అస్వస్థతకు గురైన ఇద్దరు గురుకుల విద్యార్థులను తెల్లవారు జామున ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించి ఒకరు మృతి చెందగా.. మరొకరు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు.
ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలని మంత్రి నారా లోకేష్ సూచించారు. అన్ని స్కూళ్లలో ఇంటర్ నెట్ తప్పని సరిగా ఏర్పాటు చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సహా అందరం మోడల్ పీటీఎం సమావేశాలకు హాజరవుతామని మంత్రి లోకేష్ వెల్లడించారు.
ఇకపై స్కూళ్లలో(schools) ఉపాధ్యాయలకు పిల్లలు గుడ్ మార్నింగ్ చెప్పకూడదు(No Good Morning). అవును మీరు విన్నది నిజమే. కానీ దానికి బదులుగా జై హింద్ అని చెప్పాలి. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఆగస్టు 15న జరగనున్నాయి.
పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికల ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గంలోని మూడు మండలాలతోపాటు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికలు సజావుగా జరిగాయి. నియోజకవర్గంలోని హిందూపురం మండలం మలుగూరు, లేపాక్షి మండలం మైదుగోళం పాఠశాల మినహాయించి మొత్తం ప్రక్రియ పూర్తి చేశారు. చైర్మన, వైస్ చైర్మన సభ్యులను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు.
కలుషితాహారం తిని 49 మంది గురుకుల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాలలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటును విడుదల చేసింది. ఈ గ్రాంటు కింద వచ్చే మొత్తంతో పాఠశాలల నిర్వహణలో భాగంగా అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల స్కూళ్లతో పాటు, మోడల్ స్కూళ్లలో గదులు, మురుగుదొడ్ల శుభ్రత, ఆవరణలోని మొక్కలకు నీళ్లు పోయడం, బడి పరిసరాలను శుభ్రంగా ఉంచడం వంటి పనులను నిర్వహిస్తారు.
ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. ఈ మధ్యనే వికారాబాద్ అనంతగిరిపల్లి సమీపంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో పలువురు విద్యార్థులు పచ్చ కామెర్లకు గురవ్వగా, తాజాగా ఇదే పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు కామెర్లతో ఆస్పత్రిలో చేరారు.