Home » Schools
హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని స్కూళ్లకు విద్యాశాఖ సెలవు ప్రకటించింది.
మండలంలోని కురబలకోట జడ్పీహైస్కూల్‌లో నాబార్డు నిధులతో జరిగిన పనులలో నిధుల స్వాహాపై ఉపవిద్యాధికారి పురుషోత్తం బుధవారం విచారణ చేపట్టారు.
దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుందని, కానీ కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు చదువుకు నోచుకోని పరిస్థితి దాపురించిందని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో గిరిజన బిడ్డలు అధికంగా నివసించే ప్రాంతాల్లో ఉపాధ్యాయులు లేరన్న సాకు చూపి 43 ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం కాంగ్రెస్ చేతకాని పాలనకు నిదర్శనమంటూ ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
బాలికల్లో అక్షరాస్యతను పెంచేందుకు ఏర్పాటు చేసిన కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బందికి ఉద్యోగ భద్రత కరువైంది.
రాష్ట్రంలోని 25 వేల మంది పేద విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో ఉచితంగా చదువుకునే అవకాశం కల్పించే బెస్ట్ అవేలబుల్ స్కూల్స్(బీఏఎస్) పథకానికి నిధులను విడుదల చేయాలని సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు
అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
Andhrapradesh: తిరుపతిలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో గురువారం ఉదయం విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. బైరాగిపట్డెడలోని సోక్రటీసు స్కూల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఆ సమయంలో పిల్లలు ఎలాంటి గాయాలు అవగా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయతలపెట్టిన సమీకృత గురుకులాలకు అవసరమైన భూములను సేకరించాలని, త్వరితగతిన డిజైన్లను పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క అధికారులను ఆదేశించారు.
ఉపాధ్యాయుల పని సర్దుబాటు అంశం కొలిక్కి వచ్చింది. సుమారు 15వేల మంది టీచర్లను సర్దుబాటు విధానంలో ఇతర పాఠశాలలకు పంపనున్నారు.
అంగన్‌వాడీలు అనగానే.. బాలింతలు, గర్భిణులు, చిన్న పిల్లలకు గుడ్లు, పాలు అందించడం అనే విషయాలే గుర్తుకొస్తాయి. కానీ ఇక నుంచి అలా కాకుండా.. అంగన్‌వాడీలంటే ప్రీ-ప్రైమరీ (పూర్వ ప్రాధమిక విద్య) పాఠశాలలని గుర్తొచ్చేలా చేయాలని మహిళా, శిశు సంక్షేమశాఖ నూతన చర్యలకు శ్రీకారం చుడుతోంది.