Home » SC Classification
మూడు దశాబ్దాలకుపైగా అలుపెరగని ఉద్యమం! అనేక బలిదానాలు... వేలాది కేసులు! భారీ బహిరంగ సభలు! నిరాహార దీక్షలు... చైతన్య యాత్రలు! ఏళ్లు గడుస్తున్నా వెనుకడుగు వేసిందే లేదు! గమ్యం చేరేదాకా తగ్గేదే లేదు. ఇది.. ఎమ్మార్పీఎస్ ‘వర్గీకరణ’ ఉద్యమం సాగిన తీరు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును వ్యతిరేకిస్తున్నామని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ స్వయంగా హైదరాబాద్ వచ్చి ఎస్సీ వర్గీకరణ గురించి ప్రకటన చేశారని గుర్తు చేశారు.
షెడ్యూల్డు కులాల్లో ఉప కులాలను వర్గీకరించి రిజర్వేషన్ ఫలాలు వారికి అందజేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఓబీసీ ఉప కులాలకు వర్గీకరణ మాటేమిటన్న విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
ఎస్సీ వర్గీకరణ కోసం అకుంఠిత దీక్షతో పోరాడామని, ఈ ప్రయాణంలో ఎందరినో కోల్పోయామని, చివరికి ధర్మమే గెలిచిందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు.
సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతించినందున తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అందరికంటే ముందు భాగాన నిలబడి షెడ్యూల్డు కులాల (ఎస్సీ) ఏబీసీడీ వర్గీకరణను అమలు చేసే బాధ్యత తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
షెడ్యూల్డు కులాల్లో ఉప కులాలను వర్గీకరించి రిజర్వేషన్ ఫలాలు వారికి అందజేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఓబీసీ ఉప కులాలకు వర్గీకరణ మాటేమిటన్న విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
మాదిగ దండోరా (ఎమ్మార్పీఎస్ ఉద్యమం) పుట్టింది ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మారుమూల గ్రామం ఈదుముడిలో..! అదివరకే ఆ ఊరిలో సామాజిక స్పృహ కలిగిన మాదిగ యువకులు చెరువు నీళ్ళ కోసం, భూపంపకాల్లో సమన్యాయం కోసం పోరాడిన సందర్భాలున్నాయి.
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల బీజేపీలో జోష్ వ్యక్తమవుతోంది. వర్గీకరణ అంశాన్ని తాము ఎన్నికల కోణంలో కాకుండా సామాజిక కోణంలోనే చూశామని, ఫలితంగా మున్ముందు మాదిగ సామాజికవర్గం తమకు అండగా ఉంటుందని భావిస్తోంది.
ఎస్సీ వర్గీకరణ కోసం అకుంఠిత దీక్షతో పోరాడామని, ఈ ప్రయాణంలో ఎందరినో కోల్పోయామని, చివరికి ధర్మమే గెలిచిందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు.