Home » SC Classification
ఎస్సీ వర్గీకరణపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలయింది.
ఎస్సీ వర్గీకరణ అమలుకు సంబంధించి కమిటీని నియమిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీల సమస్యలు, వాటి పరిష్కార మార్గాలే అజెండాగా ఎస్సీ, ఎస్టీ పార్లమెంటరీ సంక్షేమ కమిటీ శనివారం ఢిల్లీలో సమావేశమైంది.
ఎస్సీ వర్గీకరణ రూపశిల్పి ఏపీ సీఎం చంద్రబాబు అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.
స్సీల వర్గీకరణ అమలు కోసం ఒక ఉప కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మంత్రి దామోదర రాజనర్సింహా నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని అనుకుంటోంది.
ఒకపక్క పంచాయతీ సహా స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి. మరోపక్క ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన స్థితి. ఈ క్రమంలో అనేక చిక్కులు, ఇతర సమస్యలు..
రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసే అవకాశం కనిపించడం లేదు.
Telangana: ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం జరగాలని పోరాటం చేశామని... ఈ పోరాటంలో అనేక మంది యువకులు చనిపోయారని కాంగ్రెస్ నాయకులు గజ్జెల కాంతం అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... మందకృష్ణ మాదిగ 30 ఏళ్లు పని చేశారని.. తాము కాదనడం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు నాంది పలికారని... వైఎస్ హయాంలోనే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేశారని గుర్తుచేశారు.
ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణాలర్పించిన వారి కంటే తమ శ్రమ గొప్పది కాదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వర్గీకరణ కోసం తెల్లబండ్ల రవి మొట్టమొదల ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. బిడ్డల ప్రాణ త్యాగాలకు నేడు ఫలితం దక్కిందన్నారు.
సుప్రీం కోర్టు తీర్పు మేరకు మాదిగ జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి మాదిగ సంఘాలువిజ్ఞప్తి చేశాయి.