Home » Sankranthi
పొంగల్(Pongal) బహుమతులు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా టోకెన్ల పంపిణీ ప్రారంభమైంది. రేషన్ ఉద్యోగులు శుక్రవారం నుంచి ఇంటింటికీ వెళ్లి టోకెన్లు ఇస్తున్నారు. ఈ ఏడాది పొంగల్ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా కిట్ అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) ప్రకటించిన సంగతి తెలిసిందే.
వ్యవసాయశాఖలో ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వస్తున్న పదోన్నతుల ప్రక్రియను సంక్రాంతిలోపు పూర్తిచేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
సంక్రాంతి పండుగ(Sankranti festival), ఇతర పర్వదినాలకు సొంతూళ్లకు వెళ్లేవారికి ఆర్టీసీ శుభావార్త. జనవరి 7 నుంచి 15 వరకు 6,432 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఈ సారి మరో వెయ్యి బస్సులు, 557 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని ఆర్టీసీ ప్రయాణికుల కోసం ప్రకటన విడుదల చేసింది.
‘పొంగల్ గిఫ్ట్’(Pongal gift) ప్యాక్ టోకెన్లపంపిణీ ఈనెల 3వ తేది నుంచి ఇంటింటికీ వెళ్లి అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. పొంగల్ పండుగ(Pongal festival) సందర్భంగా బియ్యం కార్డుదారులు, శ్రీలంకతమిళుల పునరావాస శిబిరాల్లో ఉంటున్న వారికి తలా కిలో పచ్చి బియ్యం, కిలో చక్కెర, చెరుగు గడ అందించనున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసిన విషయంతెలిసిందే.
అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో సీఎంను కలిసిన సినీ ప్రముఖులు.. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు గురించే ప్రధానంగా ప్రస్తావించినట్టు సమాచారం! ఎందుకు? అంటే.. సంక్రాంతికి పలు సినిమాలు రాబోతున్నాయి.
రాష్ట్రంలో జల్లికట్టు పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రంలో జనవరి 14వ తేది పొంగల్ వేడుకల్లో భాగంగా జల్లికట్టు పోటీలు నిర్వహిస్తుంటారు. మదురై అవనియాపురం, పాలమేడు, అలంగానల్లూర్(Madurai Avaniyyapuram, Palamedu, Alanganallur) తదితర ప్రాంతాల్లో జరిగే జల్లికట్టు పోటీలు చూసేందుకు దేశ, విదేశాల నుంచి ప్రజలు తరలివస్తుంటారు.
తొలి ఏడాది పాలనలో రుణమాఫీ పథకం అమలుకు పూర్తి ప్రాధాన్యమిచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. రెండో సంవత్సరంలో రైతులకు సంబంధించిన ఇతర వ్యవసాయ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించింది.
కుటుంబ కార్డులకు జనవరి మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా పొంగల్(Pongal) గిఫ్ట్‌తో చీర, ధోవతి పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి గాంధీ(Minister Gandhi) పేర్కొన్నారు. ఈ అంశంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
సంక్రాంతి(Sankranti)కి సుమారు నాలుగునెలల ముందే ఏపీకి వెళ్లే రైళ్లల్లో బెర్త్‌లన్నీ నిండిపోయాయి. రిజర్వేషన్ బుకింగ్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే బెర్త్‌లు అయిపోయాయి. అప్పుడే వెయిటింగ్ లిస్ట్ భారీగా కనిపిస్తోంది. ప్రత్యేకించి నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకున్న ఏపీ వాసులైతే కుటుంబాలతో సహా తమ ఊర్లకు వెళ్లేందుకు నాలుగు నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు.
అమెరికాలో(America) సంక్రాంతి వేడుకలను(Sankranthi Celebrations) అక్కడి తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కెనడా, నోవా స్కోటియా, హాలిఫాక్స్, డార్ట్ మౌత్, బెడ్ ఫోర్డ్ తదితర ప్రాంతాల్లో ఎన్ఆర్ఐ(NRIs)లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూ సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా ముగ్గులు, గాలిపటాలు, పూల తోరణాలతో ఆయా ప్రాంతాలు రంగులమయం అయ్యాయి.