Home » Sangareddy
పులివెందుల వైసీపీ నాయకుల చెరలో ఉన్న ఆరు కార్లు యజమానికి చేరాయి. సంగారెడ్డికి చెందిన హరహర రెంటల్ కార్ ట్రావెల్స్ యజమాని సతీష్ కుమార్.. వికారాబాద్‌కు చెందిన మణిరాజ్‌కు 2021లో ఆరు కార్లు అద్దెకిచ్చాడు. మణిరాజ్ నుంచి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు ఆరు కార్లను లీజ్‌కు తీసుకుని పులివెందులకు తీసుకువెళ్లి అక్కడే ఉంచుకున్నారు.
గత మూడేళ్లుగా పులివెందుల వైసీపీ నాయకుల చెరలో ఉన్న తెలంగాణ వ్యక్తికి చెందిన ఆరు కార్లకు ఏపీ మంత్రి నారా లోకేష్ చొరవతో మోక్షం లభించింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సతీ్‌షకుమార్ హరిహర కార్ రెంటల్ పేరిట సంస్థను నడుపుతున్నాడు.
రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గిర్మాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్‌ను కలెక్టర్ వల్లూరు క్రాంతి సస్పెండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. తెల్లవారు జామున పొగమంచు రోడ్లను కప్పేస్తోంది.
ఇంట్లో ఉన్న యువతిపై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసి, ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం వాసర్‌లో జరిగింది.
బాలికపై అత్యాచారం చేసిన కేసులో నేరం రుజువు కావడంతో దోషికి 20 సంవత్సరాల జైలు శిక్ష పడింది. దాంతోపాటు రూ.25వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయాధికారి కె.జయంతి శుక్రవారం తీర్పు చెప్పారు.
రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరిగింది. పలు జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇటీవలే సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో ఈ చలికాలంలో తొలిసారి కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయిన విషయం తెలిసిందే.
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం పటేల్‌గూడలోని సర్వే నంబరు 6, 12లో ఉన్న భూములను సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణలో రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మంగళవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు మరింత తగ్గాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో రాష్ట్రంలోనే కనిష్ఠ ఉష్ణోగ్రత 9.0గా నమోదైంది.