Home » sajjanar
తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల పెంపు అంశం దుమారం రేపుతోంది. ఛార్జీలు పెంచి ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్నారని మాజీమంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. స్పెషల్ బస్సులకు మాత్రమే ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని, రెగ్యులర్ బస్సులకు లేవని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.
TGSRTC: పండుగ వేళ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం. దసరా వేళ స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లు పెట్టేందుకు సిద్ధమైంది. దసరా రద్దీ దృష్ట్యా స్పెషల్ బస్సులు నడుపుతున్నామని ప్రకటించిన ఆర్టీసీ.. ఆ బస్సుల్లో ప్రత్యేక ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేసింది.
Telangana: హైదరాబాద్ శివారు నుంచి దసరాకు స్పెషల్ బస్ సర్వీసులు నడుస్తాయని టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరుకు సర్వీసులను సిద్ధం చేశామన్నారు. కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని మహిళా సమాఖ్యలచే బస్సులను కొనుగోలు చేయించి అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి నడిపించనున్నామని, ఆ మేరకు మెప్మాతో సంప్రదింపులు జరుపుతున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
నిమజ్జన కార్యక్రమాలు తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ప్రజలు ట్రాఫిక్‌లో ఇరుక్కుని ఇబ్బందులు పడకుండా టీజీఎస్ఆర్టీసీ చర్యలు చేపట్టింది.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో యువత రీల్స్ కోసం చేయరాని పనులన్నీ చేసేస్తున్నారు. కొందరు ప్రాంక్ వీడియోల పేరుతో జనాన్ని ఇబ్బంది పెడుతుంటే.. మరికొందరు ఛాలెంజ్ వీడియోల పేరుతో అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తుంటారు. ఇటీవల ఇలాంటి వీడియోలు చేసే వారు రోజు రోజుకూ పుట్టకొకరు, చెట్టుకొకరు అన్నట్లుగా..
‘గ్రాండ్ హెల్త్ చాలెంజ్’లో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కూడా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
ఆర్టీసీ బస్సులో గర్భిణీకి పురుడుపోసి మానవత్వం చాటుకున్న సంస్థ సిబ్బందిని టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ.సజ్జనార్ ఘనంగా సన్మానించారు.
ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడుకొని ఓ యువకుడు చేసిన వీడియోపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఓ యువకుడు ఆర్టీసీ బస్సు కింద పడుకుని స్టంట్ చేసినట్లుగా ఓ వీడియో సోషల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ..
తెలంగాణ ఆర్టీసీ సంబంధించి ఫేక్ లోగో క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ఆర్టీసీ) ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఫేక్ లోగోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఘటనపై హైదరాబాద్ కమిషనరేట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు గురువారం ఫిర్యాదు చేశారు.