Home » Saif Ali Khan
సైఫ్ అలీఖాన్‌పై దాడి జరిగి వారం గడిచింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బంగ్లాదేశీయుడిగా నిందితుడిని గుర్తించారు. ఓ చొరబాటుదారుడు సైఫ్ అలీఖాన్ ఇంట్లో చోరికి ఎందుకు వెళ్లాడానే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు.
దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో కొన్ని రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. అతడి ఆరోగ్యం కుదుటపడడంతో మంగళవారం డిశ్ఛార్జ్ అయ్యాడు. అంత పెద్ద దాడి నుంచి బయటపడి క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు.
Saif Ali Khan Case: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ కేసులో రోజుకో కొత్త విషయం బయటకు వస్తుంది. ఊహించని మలుపులు తిరుగుతున్న ఈ కేసులో సొంత మనుషులే సైఫ్‌ను చంపాలని చూశారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి బలమైన కారణం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
షెహజాద్ ఏడు నెలల క్రితమే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ఇండియాలోకి అడుగుపెట్టాడని, ముంబైకి రావడానికి ముందు అతను పశ్చిమబెంగాల్ ఆథార్ కార్డుతో సిమ్ సంపాదించినట్టు పోలీసులు చెబుతున్నారు.
సైఫ్‌ను ఆసుపత్రికి తరలించిన డ్రైవర్ భజన్ సింగ్ ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఛార్జీ కూడా తీసుకోకుండా సమయానికి ఆస్పత్రికి చేర్చేందుకు సహకరించిన ఆటో డ్రైవర్‌కు ఓ సంస్థ రివార్డు అందించింది..
సైఫ్ ఆలీఖాన్‌పై దాడి నిందితుడు షహబాద్‌ను కనిపెట్టి అతన్ని పట్టుకునేందుకు ఒక లేబర్ కాంట్రాక్టర్ ముంబై పోలీసులకు సహకరించాడు. ఒక పోలీసు అధికారి కథనం ప్రకారం, విచారణలో భాగంగా దాదర్ రైల్వే పోలీస్ స్టేషన్ వెలుపల తిరుగుతూ నిందితుడు మూడు సార్లు కనిపించాడు.
ఈనెల 16వ తేదీ తెల్లవారుజామున దొంగతనం కోసం ముంబై బాంద్రా ఏరియాలోని సైఫ్ ఇంట్లోకి అడుగుపెట్టిన నిందితుడు ఆ క్రమంలోనే సైఫ్‌పై పదునైన బ్లేడుతో పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. శరీరంపై ఏడు చోట్ల గాయాలైన సైఫ్ ఆ వెంటనే నగరంలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసి పరారైన అసలు నిందితుడు ఎట్టకేలకు థానేలో పోలీసులకు చిక్కాడు. అరెస్ట్ తర్వాత ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు అతడి గురించి పలు సంచలన విషయాలను వెల్లడించారు. నిందితుడు ఏ పని కోసం సైఫ్ ఇంటికి వెళ్లాడో అసలు నిజం బయటపెట్టినట్లు..
Saif Ali Khan Case: సైఫ్ అలీ ఖాన్ కేసులో మొత్తానికి నిందితుడు దొరికేశాడు. అతడ్ని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా స్కెచ్‌తో అతడ్ని పట్టుకున్నారు.
Mumbai Police: ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో సంచలన నిజాలు బయటపెట్టారు.