Home » Sabitha Indra Reddy
హైడ్రా ఉక్కుపాదం మోపడంతో.. పలు కాలనీల వాసులు బాధితులుగా మారారు. దీంతో తమ గోడు వినిపించేందుకు ప్రభుత్వంలో ఒక్కరు లేక పోయారు. ఇటువంటి పరిస్థితుల్లో తమ బాధలు వినిపించేందుకు వారంతా శనివారం ఉదయం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు హరీశ్ రావుతోపాటు సబితా ఇంద్రారెడ్డితో వారు సమస్యలు చెప్పుకున్నారు.
గతంలో ఒకే పార్టీలో ఉన్న ముగ్గురు మహిళా నేతలు ప్రస్తుతం ఉప్పూనిప్పులా మారారు. వారిలో ఇద్దరు పార్టీ మారగా, ఒకరు మాత్రం అదే పార్టీలో కొనసాగుతున్నారు. అయితే ఆ ముగ్గురూ మంగళవారం బాలాపూర్(Balapur)లో జరిగిన గణేశ్ శోభాయాత్రలో ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కుతోపాటు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Maheshwaram MLA Sabitha Indra Reddy) డిమాండ్ చేశారు.
పొరపాటున మాట్లాడిన మాటలపై కేటీఆర్ హుందాగా క్షమాపణ చెప్పినా... కొందరు కాంగ్రెస్ మహిళా నేతలు ఇంకా విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ మహిళా నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేటీఆర్, హరిష్ రావులు టార్గెట్‌గా కాంగ్రెస్ చేస్తున్న కామెంట్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం నాడు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ వాని దేవి ప్రెస్‌మీట్‌లో ..
వైరాలో నిర్వహించిన మూడో విడత రైతు రుణ మాఫీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి హరీశ్ రావుపై సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2లక్షల రుణమాఫీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా, నయవంచన చేసిందంటూ మండిపడ్డారు.
దొంగతనం ఆరోపణతో దళిత మహిళను చిత్రహింసలకు గురి చేసిన ఘటనలో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ సహా ఆరుగురిని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు.
అసెంబ్లీలో తమను సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా విమర్శించారని, మహిళల పట్ల ఆయన తీరు సరికాదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు.
‘అక్కా..! మా పార్టీలోకి రండి.. సీఎం చేస్తం..’ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ఆహ్వానం పలికారు.
‘ఏడుపు ఎందుకు సబితమ్మా? చేవెళ్ల చెల్లమ్మా అని కాంగ్రెస్ పార్టీ ఆదరించినందుకా?’ అంటూ ఆ పార్టీ బుధవారం అసెంబ్లీలో జరిగిన సంఘటనపై ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించింది.