Home » Resign
కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లోని బుధని నియోజకవర్గం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విదిషా నియోజకవర్గం నుంచి ఆయన ఎంపీగా గెలిచారు.
శిద్దా రాఘవరావు.. వైసీపీకి (YSRCP) రాజీనామా చేశారు సరే.. టీడీపీలోకి (TDP) ఎంట్రీ లేదని కూడా క్లియర్ కట్‌గా సందేశం వచ్చేసింది..! ఇప్పుడీ సీనియర్ నేత భవిష్యత్ కార్యాచరణ ఏంటి..? కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని ఎన్నో కలలు కన్న శిద్దా (Sidda Raghava Rao) పరిస్థితి ఇప్పుడేంటి..?
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం తర్వాత ఒక్కొక్కరుగా రాజీనామా చేయడం మొదలుపెట్టారు. మాజీ మంత్రి, సీనియర్ నేత రావెల కిశోర్ బాబుతో మొదలైన రాజీనామాలు ఇంకా ఆగలేదు. ఇప్పుడే అసలు సిసలైన సినిమా వైసీపీ మొదలైనట్లుగా నేతలు వరుస రాజీనామాలు చేసేస్తున్నారు..
సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని కర్హాల్ అసెంబ్లీ సభ్యత్వానికి బుధవారంనాడు రాజీనామా చేశారు. కన్నౌజ్ లోక్‌సభ స్థానానికి అఖిలేష్ యాదవ్ ఇటీవల ఎన్నిక కావడంతో ఎంపీ పదవిలో కొనసాగేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) వైసీపీ (YSR Congress) ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం, కనీసం ప్రతిపక్ష హోదా లేకపోవడంతో పార్టీ ఉంటుందా..? ఊడుతుందా అనే విషయం కూడా తెలియట్లేదు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనతో సహా తన మంత్రివర్గ సహచరుల రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బుధవారంనాడు అందజేశారు. రాష్ట్రపతి భవన్‌కు మోదీ స్వయంగా వెళ్లి రాజీనామాలను సమర్పించారు. అందుకు అంగీకరించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం జరిగేంత వరకూ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగాలని మోదీని కోరారు.
ఐదేళ్ల పాటు వీరితో పనులు చేయించుకున్న సర్కార్.. ఎన్నికల సమయం రాగానే రాజీనామాలు చేయించేందుకు అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చారు. ఇలా రాజీనామా చేసిన వారినే, మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత వలంటీర్లుగా గుర్తిస్తామని మభ్యపెట్టింది. ప్రభుత్వం నుంచి వేతనం ఇస్తూ.. పార్టీకి సేవలందించాలనే తీరులో వీరి వ్యవహారం సాగింది.
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. తన సొంత సమ్మతిపై ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని, ఆయన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెంటనే ఆమోదించారని పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జి జైరామ్ రమేష్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు (AP Elections) కీలక దశకు చేరుకున్నాయి. పట్టుమని పదిరోజులు కూడా సమయం లేకపోవడంతో అభ్యర్థులు అస్త్రాలను బయటికి తీస్తున్నారు. అయితే.. అదేంటో కానీ మంత్రి రోజాపై మాత్రం సొంత పార్టీ నేతలే రివర్స్ అవుతున్నారు. అంటే.. రోజాపైనే సొంత మనుషులు రివర్స్ అస్త్రాలు వదులుతున్నారన్న మాట!
తెలంగాణ గడ్డపై రుణమాఫీ అంశంపై అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది. ఆగస్టు 16వతేదీ లోపు రుణమాఫీ చేయకుంటే సీఎం పదవికి రాజీనామా చేయాలని, రుణ మాఫీ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ రావు ఛాలెంజ్ చేశారు.