Home » Reliance Jio
దీపావళి సందర్భంగా రిలయన్స్ జియో (Jio) బంపర్ ఆఫర్ ప్రకటించింది. జియో భారత్ దీపావళి ధమాకా ఆఫర్ పేరుతో జియో భారత్ 4జీ ఫోన్ల (JioBharat 4G) ధరను తగ్గించింది.
జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఎప్పుడైతే టెలికాం ఛార్జీలు పెంచడం ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్‌కు భారీగా కలిసొచ్చింది. రీఛార్జ్ ధరలు పెంచినప్పటి నుంచి ప్రైవేటు టెలికాం కంపెనీలు యూజర్లను కోల్పోతుండగా.. అంతకంతకూ బీఎస్ఎన్ఎల్ లాభపడుతోంది.
తన కస్టమర్లు పక్క కంపెనీల వైపు చూడకుండా సరికొత్త సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లను రిలయన్స్ జియో ప్రవేశపెడుతోంది. ఈ క్రమంలో రోజుకు సగటున రూ.10 వెచ్చించి 98 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌తో అదిరిపోయే ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. ఈ ప్లాన్‌కు సంబంధించిన వివరాలను మీరూ తెలుసుకోండి.
Airtel, Reliance Jio, BSNL, Vodafone-Idea (Vi) వంటి ప్రముఖ టెలికాం ప్రొవైడర్లు సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేసే ప్రక్రియ సులభంగా, సురక్షితంగా చేయడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) గణనీయమైన మార్పులను చేపట్టింది.
మార్కెట్‌లో నెలకొన్న పోటీ, కస్టమర్లకు తరలి వెళ్లే అంశాలను దృష్టిలో ఉంచుకొని రిలయన్స్ జియో పలు ఆసక్తికరమైన ప్లాన్లను అందిస్తోంది. నెలకు రూ.75 ఖర్చుతో 28 రోజుల అపరిమిత కాలింగ్, నెలకు 2జీబీ డేటా అందించే ఒక ఆకర్షణీయమైన ఆఫర్‌ను జియో అందిస్తోంది. అయితే జియోఫోన్ (JioPhone) వాడుతున్న కస్టమర్లకు మాత్రమే ప్లాన్ వర్తిస్తుంది.
రిలయన్స్ జియో తన 8వ వార్షికోత్సవం సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌హోల్డర్‌లకు శుభవార్త చెప్పింది. ఈ క్రమంలో ఏడేళ్ల తర్వాత మళ్లీ 1:1 బోనస్ షేర్లను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ ఇన్వెస్టర్లు సంతోషం వ్యక్తం చేశారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ ఏజీఎం సమావేశంలో భాగంగా జియో(jio) కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో PhoneCall AI సేవ కాల్‌లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫీచర్ ద్వారా మీరు కాల్ చేయకుండానే సందేశాలను పంపవచ్చు. కాల్ సంభాషణను మెసేజ్ రూపంలో స్వీకరించవచ్చు. అయితే ఈ సేవను ఎలా ఉపయోగించాలో ఇక్కడ చుద్దాం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ ఏజీఎం సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ కీలక ప్రకటనలు చేశారు. ప్రభుత్వానికి ఒక్క ఏడాదిలోని రూ. 1,86,440 కోట్లను అందించినట్లు తెలిపారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
జియో సహా అన్ని ప్రధాన ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్(Recharge Plans) ధరలను పెంచాయి. రీఛార్జ్ ప్లాన్ ధరల పెంపు కారణంగా జియో అనేక ప్లాన్‌లను సవరించింది. ఇటీవల జియో OTT అపరిమిత కాలింగ్, డేటా, ఉచిత సభ్యత్వాలను అందించే కొన్ని ప్లాన్స్‌ని ప్రవేశపెట్టింది.
బీఎస్ఎన్ఎల్.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియాలు టారిఫ్ చార్జీలు పెంచినప్పటి నుంచి ఆ టెలికాం సంస్థల వినియోగదారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భారీగా పెరిగిన రీచార్జ్ ధరలతో యూజర్లు నెట్టుక్కురావడం కష్టంగా మారింది.