Home » Rayadurg
బెస్త కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో బెస్తకులస్థుల ఆరాధ్యదైవం అంబిగర చౌడయ్య జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
గార్మెంట్స్ రంగ పురోభివృద్ధికి ఎగుమతుల్లో వేగం పెరిగేలా రాయదుర్గం మీదుగా వెళుతున్న టాటానగర్, మైసూర్, వారణాసి, జైపూర్, యశ్వంతపూర్ రైళ్లను రాయదుర్గం స్టేషనలో ఆగేలా ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్ర రైల్వే సహాయ మంత్రి సోమన్నను ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు కోరారు.
పూటకో వేషం.. రోజుకో మోసంతో మ్యాట్రిమోనీ(Matrimony)లో అమ్మాయిలను మోసం చేసి రూ.లక్షల్లో డబ్బులు కొట్టేస్తున్న మోసగాడిపై రాయదుర్గం పోలీసులు(Rayadurgam Police) కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. నగరానికి చెందిన వంశీకి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ప్రయాగరాజ్ కుంభమేళా(Prayagraj Kumbh Mela)ను పురస్కరించుకుని జిల్లాలోని రాయదుర్గం, కర్ణాటక(Rayadurgam, Karnataka)లోని బళ్లారి మీదుగా ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.
నగరంలోని కార్ల యజమానులకు టోకరా వేసి లక్షల రూపాయలు కొల్లగొడుతున్న ముఠా ఆటకట్టించారు రాయదుర్గం పోలీసులు(Rayadurgam Police). మహిళా గ్యాంగ్ లీడర్ సహా.. ముఠాలోని నలుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 2.50కోట్ల విలువైన 21 కార్లను స్వాధీనం చేసుకున్నారు.
పేదరిక నిర్మూలన కోసం ఫోర్‌పీల సూత్రాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయ సమావేశ మందిరంలో తహసీల్దార్ నాగరాజు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు.
కణేకల్లు శ్రీచిక్కణ్ణేశ్వర వడియార్ చెరువుకు మూడు చోట్ల చిన్నపాటి రంధ్రాలు పడడంతో సకాలంలో స్పందించిన అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేసి నీటి లీకేజీని అరికట్టారు.
పట్టణంలో అర్హతలేని రెండు ప్రైవేట్ క్లినిక్‌లు, ఒక మొలల క్లినిక్‌ను సీజ్ చేసినట్లు డీఎంహెచఓ భ్రమరాంబికాదేవి తెలిపారు. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా నడుపుతున్న మరో మూడు ప్రైవేట్ క్లినిక్‌కు నోటీసులు ఇచ్చామన్నారు.
రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజక వర్గాల్లోని ప్రజలకు, ఆయా ప్రాంతాలకు వెళ్లే వారికి కొన్నేళ్లుగా నెలకొన్న ప్రయాణ కష్టాలు త్వరలో తీర నున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో రోడ్లన్నీ చాలా అధ్వానస్థితికి చేరుకుని ప్రజ లు చాలా అవస్థలు పడ్డారు. ముఖ్యంగా జిల్లాలో హెచ్చెల్సీపై కణేకల్లు బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది.
నాడు దివి నుంచి భువికి గంగను దించేందుకు భగీరథ మహర్షి మహా ప్రయత్నమే చేశారు. నేడు... తుంగభద్రమ్మను కాపాడుకునేందుకు ఇంజనీర్లు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.