Home » Raptadu
బఫర్‌తో సంబంధం లేకుండా డీలర్లకు రేషన బియ్యం సరఫరా చేయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆమె గురువారం సాయం త్రం నగరంలోని క్యాంపు కార్యాలయంలో శ్రీ సత్యసాయి, అనంతపు రం జిల్లాలకు సంబంధించిన పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. రేషన డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో చర్చించారు.
మండలంలోని ఒంటికొండ గ్రామంలో మంగళవారం గావుల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. అక్కదేవతల ఉత్సవాలు ముగిసిన అనంతరం మరుసటి రోజు పోతలయ్యస్వామికి ప్రతిఏటా ఇక్కడ గావుల మహోత్సవాన్ని నిర్వహి స్తారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్ర ప్రజలకు భరోసా వచ్చిందని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నారు. ఎమ్మెల్యే మంగళవారం మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీచేశారు. వారి కష్టసుఖాలు తెలుసుకున్నారు. ప్రతినెల ఒకటో తేదీ ఇంటి వద్దకు పింఛన వస్తోందా... లేదా.. అని ఆరాతీశారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరిం చుకుని చెన్నేకొత్తపల్లిలో ఆదివారం నిర్వహించిన రాతిదూలం లాగుడు పోటీలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఎమ్మెల్యే పరిటాల సునీత, గ్రామస్థుల సహకారంతో ఈ పోటీలు నిర్వహించారు. స్థానిక ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వృషభాలు పాల్గొన్నాయి. టీడీపీ సీనియర్ నాయకుడు ఎల్ నారాయణచౌదరి పోటీలను ప్రారంభించారు.
మండలంలోని మేడాపురం గ్రామంలో శనివారం ప్రారంభమైన లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు వైభవంగా జరుగుతు న్నాయి. ప్రతి ఏటా ఉగాది పండు గను పురస్కరించుకుని ఇక్కడ నా లుగురోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తారు.
పేద ప్రజల సంక్షేమం కోసం ఆనాడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఎమ్మెల్యే పరి టాల సునీత పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన రాప్తాడులోని టీడీపీ కార్యాలయంలో శనివారం టీడీపీ 43వ ఆవిర్బావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పరిటాల సునీత ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. టీడీపీ నాయకులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించారు.
మండలంలో ఎవరు అభివృద్ధి పనులు చేశారు? నీళ్లు ఎవరు తెచ్చారు?’ అని వైసీ నాయకులను నిలదీసి అడగండని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ఎమ్మెల్యే గురువారం మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ. 1.20కోటితో నిర్మంచిన తలుపూరు తారురోడ్డు, రూ.15లక్షలుతో నిర్మించిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ముఖద్వారాన్ని ప్రారంభించారు.
మాజీ సర్పంచ మోహన రెడ్డి పై హత్యాయత్నం వె నుక మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పాత్ర ఉండొచ్చని ఎ మ్మెల్యే పరిటాల సునీత ఆరోపించారు. రుద్రంపేట సమీపంలోని మదర్ థెరిస్సా కాలనీలో గాండ్లపర్తి కొత్తపల్లి మాజీ సర్పంచ మోహనరెడ్డిపై హత్యయత్నం జరిగింది. బాధితుడు నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఎమ్మెల్యే పరిటా ల సునీత మంగళవారం పరామర్శించారు.
మాకు విమానశ్రం వద్దు.. మాభూములే కావాలంటూ ఇనచార్జి కలెక్టర్ శివనారాయణశర్మకు రైతులు విన్నవించారు. ఇటీవల కూడేరు ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్ వస్తుందని, ఇందుకు అధికారులు భూములు గుర్తిస్తున్నారని, మీడియా, సోషల్‌మీడియాలలో పెద్దఎత్తున ప్రచారం సాగుతోంది.
ఈ నెల 27న రామగిరి మం డల ప్రజాపరిషత అధ్య క్ష ఎన్నిక జరగనుండ డంతో ఎంపీటీసీలకు ఎంపీడీఓ కార్యాలయం నుంచి నోటీసులు పం పారు. శని, ఆదివారాల్లో నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా ఆరుగురు ఎంపీ టీసీలు అందుబాటులోలేరు. అందుబాటులో లేని ఎంపీటీసీలందరూ వైసీపీ వర్గీయులే. పేరూరు-2, కొండాపురం, ఎంసీపల్లి, కుంటిమద్ది, గంతిమర్రి, పోలేపల్లి ఎంపీటీసీలు అందుబాటులో లేకపోవడంతో వారి ఇంటి గోడలకు అధికారులు నోటీసులు అతికించారు.